వైసీపీ.. అబద్ధాల ప్రభుత్వం
ABN , Publish Date - Dec 31 , 2023 | 12:34 AM
వైసీపి ప్రభుత్వం అబద్ధాల ప్రభుత్వమని మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు అన్నారు. శనివారం నిడదవోలులోని టీడీపీ కార్యాలయంలో శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ నవరత్నాలు, మేనిఫెస్టో, పాదయాత్రలో ఇచ్చిన హామీలు 15ు మాత్రమే అమలు చేసి మిగిలిన 85ు గాలికి వదిలేశాడన్నారు.
హామీలు 85శాతం గాలికొదిలేసిన జగన్
పలు సంఘాలు చేస్తున్న దీక్షలే నిదర్శనం
మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు
నిడదవోలు, డిసెంబరు 30: వైసీపి ప్రభుత్వం అబద్ధాల ప్రభుత్వమని మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు అన్నారు. శనివారం నిడదవోలులోని టీడీపీ కార్యాలయంలో శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ నవరత్నాలు, మేనిఫెస్టో, పాదయాత్రలో ఇచ్చిన హామీలు 15ు మాత్రమే అమలు చేసి మిగిలిన 85ు గాలికి వదిలేశాడన్నారు. జగన్ హామీలు అమలు చేయడంలో విఫలమయ్యాడు అనేది బహిరంగ నిజమ న్నారు. అమలుకాని హామీలపై అబద్ధాలు వల్లివేద్దామంటే జగన్ మాటలను ప్రజలు విశ్వసించరన్నారు. నేడు రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్ళినా హామీలను అమలు చేయాలని పలువురు చేస్తున్న నిరవధిక దీక్షలే ఇందుకు నిదర్శనమ న్నారు. సమావేశంలో పట్టణాధ్యక్షుడు కొమ్మిన వెంకటేశ్వరరావు, తిరుపతి సత్యనారాయణ, కారింకి నాగేశ్వరరావు, కేదారిశెట్టి వెంకటేశ్వరరావు, సతీష్, బం డి గోపాలకృష్ణ, షాజహాన్ పాల్గొన్నారు. ఇదిలా ఉండగా నిడదవోలులోని 17వ వార్డు సుబ్బరాజుపే టలో టీడీపీ, జన సేన ఉమ్మడి కార్యాచరణలో భాగంగా భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యకమ్రంలో ప్రజావేదిక నిర్వహించారు. బూరుగుపల్లి శేషారావు, బైపే రాజేశ్వరరావు, చదలవాడ శ్రీనివాసరావు, కారింకి సాయిబాబా పాల్గొన్నారు.