‘అరాచక ప్రభుత్వాన్ని గద్దె దింపాలి’
ABN , First Publish Date - 2023-11-20T00:18:50+05:30 IST
‘అరాచక ప్రభుత్వాన్ని గద్దె దింపాలి’

రాయవరం, నవంబరు 19:నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం సాగిస్తున్న అరాచక పాలనకు ప్రజలు ముగింపు పలకాలని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఆదివారం మాచవరం దేవుడి మాన్యం కాలనీలో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. జగన్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిపోయిందన్నారు. ఏపీ ప్రజలకు సుస్థిర పాలన అందిం చాలంటే వచ్చే ఎన్నికల్లో తిరిగి టీడీపీ, జనసేన కూటమిని ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యేకు మహిళలుహారతులు ఇచ్చారు. టీడీపీ నేతలు వైఆర్కే పరమహంస, నల్లమిల్లి సత్యనారాయణరెడ్డి, కోడి చిన్న అప్పారావు, మాజీ వైస్ ఎంపీపీ దేవు వెంకట్రాజు, కొవ్వూరి ఆదిరెడ్డి, కర్రి వెంకటరామకృష్ణారెడ్డి, మేడపాటి రవీంద్రారెడ్డి, గంటి చంద్రశేఖర్, మాజీ ఎంపీటీసీ నల్లమిల్లి వెంకన్నబాబు, సబ్బెళ్ల వెంకటరెడ్డి, బాబీ తదితరులు పాల్గొన్నారు.