వైసీపీ ప్రభుత్వంలో కానరాని అభివృద్ధి
ABN , First Publish Date - 2023-09-04T00:41:32+05:30 IST
నాలుగేళ్ల వైసీపీ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి శూన్యమని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు అన్నారు.
ఆత్రేయపురం, సెప్టెంబరు 3: నాలుగేళ్ల వైసీపీ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి శూన్యమని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు అన్నారు. ఆదివారం వసంతవాడ, లొల్ల గ్రామాల్లో బాబుష్యూరిటీ, భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రెండు గ్రామల్లో ఇంటింటికి వెళ్ళి భవిష్యత్ గ్యారెంటీ హామీ పత్రాలను అందజేశారు. అలాగే ప్రజావేదిక నిర్వహించి వైసీపీ వదు..్ద అవినీతి వద్దు.. క్రైమ్ వద్దు.. అనే నినాదంతో సంతకాల సేకరణ నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వాన్ని తరిమికొట్టడానికి సిద్ధంగా ఉండాలన్నారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహిళలు మహారాణులు అవుతారన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు ముదునూరి వెంకట్రాజు, బండారు వెంకటసత్తిబాబు, సర్పంచ్‌లు కాయల జగన్నాధం, గెడ్డం సుధ, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.