పోలీసులపై వైసీపీ జులుం
ABN , First Publish Date - 2023-09-26T01:18:43+05:30 IST
రాజమహేంద్రవరం, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): పోలీసులపై వైసీపీ నాయకుల కర్రపెత్తనం శృతి మించుతోంది. మాట వినకపోతే జులుం ప్రదర్శిస్తున్నారు. తమకు లొంగి ఉండేలా చూడడమేగాకుండా చట్టవ్యతిరేక పనులకు వత్తాసు పలకడం వంటివి చేయకపోతే పోలీసు సర్వీసు నిబంధనలను సైతం అప హాస్యం చేస్తూ వెంటనే సీటు మార్చేస్తున్నారు. దీంతో వీధి నాయకులకు సైతం సలాం కొట్టి గులాంగిరీ చేయాల్సి రావడంతో మాన

ఏడాదిలోపే సీఐ వీఆర్‌లోకి..
టీడీపీ కార్యకర్తలపై రౌడీషీట్ తెరవాలని ఒత్తిళ్లు
రాజమహేంద్రవరం, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): పోలీసులపై వైసీపీ నాయకుల కర్రపెత్తనం శృతి మించుతోంది. మాట వినకపోతే జులుం ప్రదర్శిస్తున్నారు. తమకు లొంగి ఉండేలా చూడడమేగాకుండా చట్టవ్యతిరేక పనులకు వత్తాసు పలకడం వంటివి చేయకపోతే పోలీసు సర్వీసు నిబంధనలను సైతం అప హాస్యం చేస్తూ వెంటనే సీటు మార్చేస్తున్నారు. దీంతో వీధి నాయకులకు సైతం సలాం కొట్టి గులాంగిరీ చేయాల్సి రావడంతో మానసికంగా ఆవేదనకు గురవుతున్నారు. ‘మేం చెప్పింది చేయాల్సిందే.. లేకపోతే ఉద్యోగం ఉండదు’ అనే బెదిరింపులతో ఖాకీ యూనిఫాం నలిగిపోతోంది. రాజమహేంద్రవరంలోని వన్ టౌన్, త్రీటౌన్ సీఐలను వీఆర్‌కి పంపిస్తూ రెండు రోజుల కిందట ఉత్తర్వులిచ్చారు. త్రీటౌన్ సీఐకి మూడేళ్ల కాలం ముగియడంతో స్థానచలనం తప్పలేదు. కానీ వన్‌టౌన్ సీఐని పంపడం వెనుక నగరానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి ఒత్తిడి ఉన్నాయనే ఆరోపణలు బలంగా వినవస్తున్నాయి. వన్‌టౌన్ సీఐ లక్ష్మణరావు గత ఏడాది అక్టోబరులో బదిలీపై వచ్చారు. ఏడాది కూడా పూర్తి కాకుండానే ఆయనను వీఆర్‌కి పంపడం పోలీ సు వర్గాల్లో చర్చనీయాంశమైంది. అసలు విషయంపై ఆరా తీయగా.. నగరంలోని ఒక టీడీపీ నాయకుడిపై ఎలాంటి పోలీసు కేసులూ లేవు. ఆ నాయకుడిపై ఏదోలా రౌడీషీట్ తెరవాలని సీఐపై సదరు వైసీపీ నేత ఒత్తిడి తెస్తున్నారు. నిబంధనలు అంగీకరించవని ఆ నేతతో పోలీసు అధికారులు స్పష్టంచేశారు. మరో టీడీపీ నాయకుడికి స్థానికంగా చిన్న తగాదా జరిగింది. అతడిపై ఏకంగా హత్యాయత్నం కేసు నమోదు చేయాలని ఒత్తిడి తెచ్చారు. దీంతో సీఐ లక్ష్మణరావుపై కక్షపూరితంగా వ్యవహరించినట్టు సమాచారం. కాగా వన్‌టౌన్ సీఐగా వి.పుల్లారావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకూ విధులు నిర్వర్తించిన ీలక్ష్మణరావు ఏలూరు వీఆర్‌లో వెళ్లారు. అలాగే త్రీటౌన్ సీఐగా ఎస్‌పీ వీరయ్యగౌడ్ చార్జి తీసుకున్నారు.