మాయమాటలతో ప్రజలను మోసం చేస్తోన్న వైసీపీ

ABN , First Publish Date - 2023-07-17T00:35:54+05:30 IST

రాష్ట్రంలోని అన్ని వర్గాలను వైసీపీ మాయమాటలతో మోసం చేస్తోందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు విమర్శించారు.

మాయమాటలతో ప్రజలను మోసం చేస్తోన్న వైసీపీ

ఆత్రేయపురం, జూలై 16: రాష్ట్రంలోని అన్ని వర్గాలను వైసీపీ మాయమాటలతో మోసం చేస్తోందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు విమర్శించారు. ఆత్రేయపురంలో టీడీపీ మండల అధ్యక్షుడు ముదునూరి వెంకట్రాజు అధ్యక్షతన ఆదివారం జరిగిన ఆ పార్టీ ఇంటిగ్రేటెడ్‌ శిక్షణ తరగతుల ముగింపు సభలో పలు వురు నేతలు ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడ్డారు. జగనన్న సురక్ష పథకం కేవలం ప్రచార ఆర్భాటం కోసమేనని, దానివల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. హక్కుల కోసం అంగన్‌వాడీలు రోడ్డెక్కితే అక్రమ అరెస్టులతో వేధించడం దారుణమన్నారు. ప్రజల దీవెనలతో చంద్రన్న పాలన రావడం తథ్యమన్నారు. అసెంబ్లీ పరిశీలకుడు వాసిరెడ్డి రాంబాబు మాట్లాడుతూ పార్టీ కార్యక్రమాల కోసం రూపొందించిన యాప్‌లను సద్వినియోగం చేయాలన్నారు. సమావే ంలో క్లస్టర్‌ ఇన్‌చార్జిలు కరుటూరి నరసింహారావు, ముళ్లపూడి భాస్కరరావు, కాయల జగన్నాథం, పాండ్రంగి రవిచంద్ర, తోటకూర సుబ్బరాజు, కుదప కృష్ణమూర్తి, జుజ్జవరపు హరిబాబు, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-07-17T00:35:54+05:30 IST