ఓటమి భయంతోనే చంద్రబాబుపై వైసీపీ శ్రేణుల దాడులు

ABN , First Publish Date - 2023-04-23T01:11:26+05:30 IST

జడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రత ఉన్న టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ఓటమి భయం తోనే జగన్మోహన్‌రెడ్డి అనుచరులు దాడులకు దిగుతున్నారని అమలాపురం లోక్‌సభ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి గంటి హరీష్‌మాధుర్‌ ఒక ప్రకటనలో ఆరోపించారు.

ఓటమి భయంతోనే చంద్రబాబుపై  వైసీపీ శ్రేణుల దాడులు

టీడీపీ లోక్‌సభ ఇన్‌చార్జి హరీష్‌మాధుర్‌

అమలాపురం, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): జడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రత ఉన్న టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ఓటమి భయం తోనే జగన్మోహన్‌రెడ్డి అనుచరులు దాడులకు దిగుతున్నారని అమలాపురం లోక్‌సభ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి గంటి హరీష్‌మాధుర్‌ ఒక ప్రకటనలో ఆరోపించారు. ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం వద్ద చంద్ర బాబు కాన్వాయ్‌పై రాళ్లు రువ్వి దౌర్జన్యానికి దిగి అల్లర్లు సృష్టించారన్నారు. రాష్ట్రమం త్రి హోదాలో ఉన్న ఆదిమూలపు సురేష్‌ ఒక రౌడీ మాదిరిగా అర్ధనగ్నంగా వైసీపీ శ్రేణులను టీడీపీ శ్రేణులపైకి రెచ్చగొట్టి దాడులు చేయించారని హరీష్‌మాధుర్‌ అన్నారు. పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర వహిస్తున్న తీరు చూస్తుంటే చంద్రబాబు ప్రాణాలకు అటు పోలీసులు, ఇటు వైసీపీ మూకల నుంచి ముప్పు పొంచి ఉందని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. ప్రతిపక్ష పార్టీలు శాంతియుతంగా నిరసన తెలిపితే వారిపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఎందరో దళితులను హతమార్చి నిత్యం దాడులు చేస్తుంటే దళిత ప్రజాప్రతినిధిగా ఉన్న ఆది మూలపు సురేష్‌ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. దళితులంతా జగన్‌ ప్రభుత్వం, వైసీపీ శ్రేణుల కుట్రలను గమనించి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.

Updated Date - 2023-04-23T01:11:26+05:30 IST