నాడు-నేడు పనుల్లో ఆలస్యమెందుకు?

ABN , First Publish Date - 2023-03-05T00:17:36+05:30 IST

గోకవరం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల్లో నాడు నేడు పనుల్లో భాగంగా జరుగుతున్న అదనపు తరగతుల భవన నిర్మాణపు పనులు నత్తనడకన కొనసాగడం పట్ల పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్ర టరీ ప్రవీణ్‌ప్రకాష్‌ అసహనం వ్యక్తం చేశారు.

నాడు-నేడు పనుల్లో ఆలస్యమెందుకు?
గోకవరం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను తనిఖీ చేస్తున్న విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ప్రకాష్‌

  • ప్రిన్సిపల్‌ సెక్రటరీ అసహనం.. ప్రిన్సిపాల్‌పై ఆగ్రహం

గోకవరం, మార్చి4: గోకవరం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల్లో నాడు నేడు పనుల్లో భాగంగా జరుగుతున్న అదనపు తరగతుల భవన నిర్మాణపు పనులు నత్తనడకన కొనసాగడం పట్ల పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్ర టరీ ప్రవీణ్‌ప్రకాష్‌ అసహనం వ్యక్తం చేశారు. గోకవరం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను శుక్రవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఆయన తనిఖీ చేశారు. కళాశాల ప్రాంగణంలో జరుగుతున్న నాడు-నేడు పనులు ఎందుకు ఆలస్యంగా జరుగుతున్నాయని అధికారులను నిలదీశారు. వేసవి సమీపించినా ఆర్వో ప్లాంట్‌ను వినియోగంలోకి తీసుకురాకపోవడాన్ని గమ నించి ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌పై ప్రవీణ్‌ప్రకాష్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. వెంటనే ఆర్వో ప్లాంట్‌ను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని హెచ్చరిం చారు. లేనిపక్షంలో చర్యలు తప్పవన్నారు. అనంతరం ఆయన కళాశాల నుంచి ఏజెన్సీ ప్రాంతం వైపు బయలుదేరి వెళ్లారు.

Updated Date - 2023-03-05T00:17:36+05:30 IST