‘మహాశక్తి’తో మహిళలకు ఆర్థిక భరోసా

ABN , First Publish Date - 2023-08-02T01:00:26+05:30 IST

తెలుగుదేశం పార్టీ మినీ మేనిఫెస్టోలో ప్రవేశపెట్టిన మహాశక్తి పథకాల ద్వారా మహిళలకు పూర్తిస్థాయి ఆర్థిక భరోసా లభిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. మండలంలోని తిరుమలాయపాలెం నుంచి మహాశక్తి చైతన్య రథయాత్ర కార్య క్రమాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు.

‘మహాశక్తి’తో మహిళలకు ఆర్థిక భరోసా
తిరుమలాయపాలెంలో చైతన్య రథయాత్రలో పాల్గొన్న నెహ్రూ

  • మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

  • తిరుమలాయపాలెంలో మహాశక్తి చైతన్య రథయాత్ర

గోకవరం, ఆగస్టు 1: తెలుగుదేశం పార్టీ మినీ మేనిఫెస్టోలో ప్రవేశపెట్టిన మహాశక్తి పథకాల ద్వారా మహిళలకు పూర్తిస్థాయి ఆర్థిక భరోసా లభిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. మండలంలోని తిరుమలాయపాలెం నుంచి మహాశక్తి చైతన్య రథయాత్ర కార్య క్రమాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మహాశక్తి ద్వా రా అమలు చేయనున్న పథకాలపై మహిళలకు అవగాహన కల్పించారు. పార్టీ అధినేత చంద్రబాబు మేనిఫెస్టోలో ప్రవేశపెట్టిన తల్లికి వందనం ద్వారా ఇంట్లో ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15 వేలు, 18 ఏళ్లు నిండిన ప్రతి ఆడబిడ్డకు నెలకు రూ.1500 అందజేస్తామన్నారు. దీపం పథకం ద్వారా ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్‌ సిలెండర్లు, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం వంటివి మేలు చేకూర్చే పథకాలు అన్నారు. పస్తుత ముఖ్యమంత్రి అమ్మఒడి పేరుతో కోతలు విధించి నగదు జమ చేస్తున్నారని విమర్శించారు. ఒక చాన్స్‌ పేరుతో గద్దెనెక్కిన జగన్‌ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా చేసారని ఆరోపిం చారు. రాష్ట్రం బాగుండాలంటే చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలన్నారు. అనంతరం కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మంగరాతి రాము, అడపా భరత్‌, ఉంగరాల రాము, వల్లేపల్లి సత్యనారాయణ, గునుపే భరత్‌, పురంశెట్టి శివాజీ, కోట సత్యవతి, గొల్లవిల్లి శ్రీదేవి, రాపాక లక్ష్మి, చెక్కా మరియా, ఉండమట్ల అరుణ, తిప్పన సత్యవతి పాల్గొన్నారు.

  • అధ్వాన స్థితిలో ప్రాజెక్టు కెనాల్‌

కనీసం సాగునీరు అందించలేని అధ్వాన స్థితిలో ప్రాజెక్టు కెనాల్‌ ఉందని జ్యోతుల నెహ్రూ విమర్శించారు. తిరుమలాయపాలెంలోని సూరంపాలెం మెయిన్‌ కెనాల్‌ను మంగళవారం సాయంత్రం స్థానిక టీడీపీ నాయకులు, రైతులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ అధినేత చంద్రబాబు పిలుపు మేరకు ఈనెల 1వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఇరిగేషన్‌ ప్రాజెక్టులను పరిశీలిస్తామన్నారు. అనంతరం ప్రాజెక్టుల స్థితిగతు లపై నివేదిక తయారుచేసి చంద్రబాబుకు అందజేస్తామన్నారు. దీనిలో భాగంగానే సూరంపాలెం మెయిన్‌ కెనాల్‌ను పరిశీలించామని చెప్పారు. ఈ సందర్భంగా రైతుల నుంచి పలు ఇబ్బందులు తమ దృష్టికి వచ్చాయన్నారు. అనేక చోట్ల ఇసుక దిబ్బలతో నీటి రవాణా అడ్డుకుంటున్నా కనీసం మరమ్మతులు చేపట్టడంలేదన్నారు. సూరంపాలెం మెయిన్‌ కెనాల్‌ను వెంటనే ఆధునీకరించి రైతులకు పుష్కలంగా సాగునీరందించాలని లేనిపక్షంలో టీడీపీ అధికారం చేపట్టిన తర్వాత సూరంపాలెం ఫేజ్‌-2కూడా పూర్తి చేస్తామన్నారు.

Updated Date - 2023-08-02T01:00:26+05:30 IST