చికిత్స పొందుతూ వివాహిత మృతి
ABN , First Publish Date - 2023-11-21T23:37:30+05:30 IST
గొల్లప్రోలు రూరల్, నవంబరు 21: గొల్లప్రోలు మండలం చేబ్రోలులో ఆ త్మహత్యకు ప్రయత్నించిన వివాహిత చికిత్స పొందుతూ మంగళవారం మ రణించింది. విశాఖ జిల్లా కొత్త గాజువాక సాయిరామ్ నగర్ ప్రాంతానికి చెందిన అనంతలక్ష్మి(35)కు చేబ్రోలు గ్రామానికి చెందిన పాలపర్తి దుర్గబాబుతో 17ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి ఒక కుమారుడు ఉన్నారు. దు ర్గబాబు తాగుడికి బానిసై భార్య, కు మారుడిని పట్టించుకోకపోవడంతో ఈనెల 16న అనంతలక్ష్మి ఆత్మహత్య కు ప్రయ

గొల్లప్రోలు రూరల్, నవంబరు 21: గొల్లప్రోలు మండలం చేబ్రోలులో ఆ త్మహత్యకు ప్రయత్నించిన వివాహిత చికిత్స పొందుతూ మంగళవారం మ రణించింది. విశాఖ జిల్లా కొత్త గాజువాక సాయిరామ్ నగర్ ప్రాంతానికి చెందిన అనంతలక్ష్మి(35)కు చేబ్రోలు గ్రామానికి చెందిన పాలపర్తి దుర్గబాబుతో 17ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి ఒక కుమారుడు ఉన్నారు. దు ర్గబాబు తాగుడికి బానిసై భార్య, కు మారుడిని పట్టించుకోకపోవడంతో ఈనెల 16న అనంతలక్ష్మి ఆత్మహత్య కు ప్రయత్నించింది. ఆమెను కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. అనంతలక్ష్మి తండ్రి బొలిశెట్టి అప్పలరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు గొల్లప్రోలు ఎస్‌ఐ వినయప్రతాప్ తెలిపారు.