మహిళా చైతన్యంతోనే ఆర్థిక పరిపుష్టి
ABN , First Publish Date - 2023-07-21T01:00:24+05:30 IST
మహిళా చైతన్యంతోనే ఆర్థిక పరిపుష్టి లభిస్తుం దని తెలుగు మహిళ నియోజకవర్గ అధ్యక్షురాలు కాకర్ల రామతులసి అన్నారు. మండలంలోని రాజంపాలెంలో మహాశక్తి ప్రచార రఽథాన్ని గ్రామ కమిటీ అధ్య క్షుడు నందమూరి సత్యనారాయణ ప్రారంభించారు.
గోపాలపురం, జూలై 20: మహిళా చైతన్యంతోనే ఆర్థిక పరిపుష్టి లభిస్తుం దని తెలుగు మహిళ నియోజకవర్గ అధ్యక్షురాలు కాకర్ల రామతులసి అన్నారు. మండలంలోని రాజంపాలెంలో మహాశక్తి ప్రచార రఽథాన్ని గ్రామ కమిటీ అధ్య క్షుడు నందమూరి సత్యనారాయణ ప్రారంభించారు. అనంతరం మహిళాలతో కలిసి టీడీపీ మినీ మ్యానిఫెస్టో మహాశక్తి పథకాలు ప్రచురించిన కరపత్రా లను ఇంటింటికీ పంచుతూ పథకాలను వివరించారు. అనంతరం రామతులసి మాట్లాడుతూ మహిళా సాధికారత టీడీపీ అధినేత చంద్రబాబుతోనే సాధ్యమ న్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే భవిష్యత్తు గ్యారెంటీలో భాగంగా ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం, దీపం పథకం కింద మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం, ఉచిత బస్సు ప్రయాణం, అన్నదాత పథకం, ఉద్యోగ కల్పన, ఇంటింటికి తాగునీరు సరఫరా వంటి పథకాలను అమలులోకి తెచ్చి మహిళలకు పెద్ద పీట వేయనున్నట్టు రామతులసి చెప్పారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ కాకర్ల జగదీష్‌కుమార్, గెడా అరుణ, దొండపూడి ముత్యాలరాయుడు తదితరులు పాల్గొన్నారు.