రోజు వ్యవధిలో భార్యాభర్తల మృతి

ABN , First Publish Date - 2023-05-26T00:13:42+05:30 IST

ఒకరినొకరు వీడ లేమన్నట్టుగా తనువు చాలించారు ఓ భార్యా భర్తలు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం సంధిపూడికి చెందిన తోరాటి సూర్యనారాయణ (65), చక్రవేణి (61) దంపతులు. ఎంతో అన్యోన్యంగా ఉండేవారు.

రోజు వ్యవధిలో భార్యాభర్తల మృతి

ఆలమూరు, మే 25: ఒకరినొకరు వీడ లేమన్నట్టుగా తనువు చాలించారు ఓ భార్యా భర్తలు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం సంధిపూడికి చెందిన తోరాటి సూర్యనారాయణ (65), చక్రవేణి (61) దంపతులు. ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్న చక్రవేణి బుధవారం రాత్రి మృతి చెందింది. దీనిని తట్టుకోలేక భర్త సూర్యనారాయణ గురువారం మధ్యాహ్నం ఒక్క సారిగా కుప్పకూలిపోయి మృతి చెందాడు. వీరికి నలుగురు కుమారులు ఉన్నారు. వ్యవసాయం చేయడంతో పాటు ఇటుక బట్టీ నిర్వహించిన సూర్యనారాయణ ఇటీవల కుమారులకు ఆ బాధ్యతలు అప్పగించి గ్రామంలో రామాలయం నిర్వహణ చూస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొ ంటున్నారు. వీరిద్దరూ గంటల వ్యవధిలో మృతి చెందడం గ్రామస్తులను కలచివేసింది.

Updated Date - 2023-05-26T00:13:42+05:30 IST