వారంలో మూడు రోజులు రాగిజావ
ABN , First Publish Date - 2023-03-22T01:11:09+05:30 IST
విద్యార్థుల ఆరోగ్యం కోసం వారానికి మూడు రోజులు రాగిజావను అందిస్తారని హోం మంత్రి తానేటి వనిత, కలెక్టర్ మాధవీలత తెలిపారు.
దివాన్‌చెరువు, మార్చి21 : విద్యార్థుల ఆరోగ్యం కోసం వారానికి మూడు రోజులు రాగిజావను అందిస్తారని హోం మంత్రి తానేటి వనిత, కలెక్టర్ మాధవీలత తెలిపారు. రాజానగరం మండలం పుణ్యక్షేత్రం జడ్పీ ఉన్నత పాఠశాలలో జగనన్న గోరుముద్ద పథకంలో భాగంగా మంగళవారం రాగిజావ జిల్లాస్థాయి ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరై మాట్లా డారు.ఈ పథకం ద్వారా జిల్లాలోని 987 పాఠశాలల్లో 1,25,785 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. ఎంపీ మార్గాని భరత్‌రామ్ మాట్లాడుతూ రాగిజావను విద్యార్థులు తప్పనిసరిగా తాగా లన్నారు.ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ రాగిజావలో పోషకాలు ఉంటాయన్నారు.ఈ కార్యక్రమంలో రుడాచైర్‌పర్సన్ షర్మిలారెడ్డి, డీఈవో ఎస్.అబ్రహాం, ఆర్డీవో ఏ.చైత్రవర్షిణి, డీవైఈవో ఎం.తిరుమలదాస్, ఎంపీడీ వో బి.రామారావు, తహసీల్దారు పవన్‌కుమార్, సీడీపీవో టి.నాగ మణి, సర్పంచ్ మరుకుర్తి వెంకటేశ్వరరావు, ఎంపీపీ మండారపు సీతా రత్నం వీర్రాజు, జడ్పీటీసీ వాసంశెట్టి పెదవెంకన్న పాల్గొన్నారు.