నీటి పాట్లు
ABN , First Publish Date - 2023-03-17T01:38:07+05:30 IST
సాగునీటి ఇబ్బందులు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మలికిపురం మండలంలో 1721 ఎకరాల్లో రైతులు వరినాట్లు వేశారు. ప్రస్తుతం ఈనిక దశ, గింజకట్టే దశలో ఉన్న స్థితిలో సాగునీరు లేక పంట చేలు నీటి కోసం అర్రులు చాస్తున్నాయి.
మలికిపురం మండలంలో ఎండుతున్న పొలాలు
మలికిపురం, మార్చి 16 : సాగునీటి ఇబ్బందులు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మలికిపురం మండలంలో 1721 ఎకరాల్లో రైతులు వరినాట్లు వేశారు. ప్రస్తుతం ఈనిక దశ, గింజకట్టే దశలో ఉన్న స్థితిలో సాగునీరు లేక పంట చేలు నీటి కోసం అర్రులు చాస్తున్నాయి. అధికారులు వంతుల వారీగా నీరందిస్తున్నా గన్నవరం ప్రధాన కాల్వలో సరిపడే నీటిమట్టం లేకపోవడంతో సాగునీరు అంద డం లేదు. దీంతో రైతులు కాల్వ నుంచి చేల వరకు, చేల నుంచి కాల్వ వరకు పరుగులెడుతున్నారు. మండలంలోని కత్తిమండ, బట్టేలంక, రామరాజులంక, గుడిమెళ్లంక గ్రామాల్లో ఈ సమస్య మరింత అధి కంగా ఉంది. గన్నవరం ప్రధాన కాల్వ నుంచి పొదలాడ లాకుల మీదుగా దిగువ ప్రాంతాలకు 190 నుంచి 200 క్యూసెక్కుల సాగునీరు రావాల్సి ఉండగా కేవలం 140 క్యూసెక్కుల నీరు మాత్రమే రావడంతో కాల్వలో నుంచి పంట బోదెలలోకి సాగునీరందడం లేదు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, రైతులపై దృష్టి పెట్టి కాల్వ నీటిమట్టం పెరిగేలా చూడాలని మలికిపురం ఎంపీపీ ఎంవీ సత్యవాణిరాము కోరారు. ఇరి గేషన్ ఏఈ రమేష్‌ను వివరణ కోరగా పొదలాడ లాకు నుంచి వం తుల వారీగా సాగునీరు అందిస్తున్నామన్నారు. తాటిపాక సెక్షన్‌లో మూడు రోజులు ఎక్కువగా నీటి వంతు తీసుకున్నందున దిగువ ప్రాం తానికి వంతు ఆలస్యమైందన్నారు. శుక్రవారం నుంచి శివకోడు దిగువ మలికిపురం, సఖినేటిపల్లి మండలాలకు సాగునీరు వంతుల విధా నంలో అందించనున్నామన్నారు. ఇప్పటికే మలికిపురం మండలంలో రై తుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని శివకోడు పైభాగాన ఒక వం తు, శివకోడు కింద ఒక వంతుగా సాగునీటి ఏర్పాట్లు చేశామన్నారు. పెదతిప్పలో వేపచెట్టు డ్రెయిన్ నుంచి తొమ్మిది నీటి ఇంజన్లతో పంటకాల్వలోకి నీటిని తోడుతున్నామని, దీనివల్ల కొంతవరకు నీటి మట్టం స్థాయి పెరుగుతుందని ఆయన చెప్పారు. కాగా రామరాజు లంకలో రైతులు అక్కడి వచ్చిన ఇరిగేషన్ అధికారులకు నీరులేని తమ భూములను చూపించి, సాగునీరందించాలని విజ్ఞప్తి చేశారు.
మెడలు వాల్చేస్తున్నాయి..
ఎండుతున్న వరి చేల దుస్థితిపై అన్నదాతల ఆందోళన
అంతర్వేది, మార్చి 16: సఖినేటిపల్లి మండలంలో దాళ్వాసాగుకు నీరు లేక రైతులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. అధిక వర్షాలు కురిసి సార్వా సాగుచేసినా పంట చేతికి వచ్చేసరికి నష్టాలే మిగిలాయని, దాళ్వాలోనైనా వరి దిగుబడులు బాగుంటాయనే ఆశలతో ఉన్న రైతులు సాగునీరు లేక విలవిల్లాడుతున్నారు. సఖినేటిపల్లి, గుడిమూల, రామేశ్వరం తదితర గ్రామాల్లో ఎండిపోయిన వరి చేలను చూసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితులు ఎప్పుడూ చూడలేదని, నీటి ఎద్దడి లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కొంతమంది రైతులు తహ శీల్దార్ రమాకుమారికి గురువారం వినతిపత్రం అందించారు. దాళ్వా సా గు చివరి దశలో ఉన్నందున సరైన సాగునీరు లేకపోవడంతో పొలాలన్నీ బీటలు వారుతూ వరికంకులు మెడలు వాలేస్తున్నాయని రైతులు వాపో తున్నారు. సుమారు 1500 ఎకరాల్లో దాళ్వా వరిసాగు ఉండగా సరైన సాగునీరు లేకపోవడంతో పంట చేతికి రాకపోగా రైతులకు నష్టాలు తప్పేలా లేవని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తక్షణం దాళ్వా సాగుకు సక్ర మంగా సాగు నీరు అందించాలని అధికారులను కోరుతున్నారు.