నేడు వాక్‌ ఫర్‌ పీస్‌ ర్యాలీ

ABN , First Publish Date - 2023-06-11T00:46:39+05:30 IST

సర్పవరం జంక్షన్‌, జూన్‌ 10: ప్రపంచ శాంతి, యువత భవిష్యత్తు కోసం ఆదివారం ఉదయం వాక్‌ ఫర్‌ పీస్‌ నడక ర్యాలీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ప్రజాపిత బ్రహ్మకుమారీస్‌ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం బ్రహ్మకుమారీ రజనీ దీదీ తెలిపారు. శనివారం సర్పవరంజంక్షన్‌లో ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన విలేకరు

నేడు వాక్‌ ఫర్‌ పీస్‌ ర్యాలీ

సర్పవరం జంక్షన్‌, జూన్‌ 10: ప్రపంచ శాంతి, యువత భవిష్యత్తు కోసం ఆదివారం ఉదయం వాక్‌ ఫర్‌ పీస్‌ నడక ర్యాలీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ప్రజాపిత బ్రహ్మకుమారీస్‌ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం బ్రహ్మకుమారీ రజనీ దీదీ తెలిపారు. శనివారం సర్పవరంజంక్షన్‌లో ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ ఏడాది ప్రపంచ దేశాలు నిర్వహించే జీ 20కి కేంద్రం అధ్యక్షతన జరిగే యూత్‌ వింగ్‌ కేంద్ర యువజన వ్యవహరాలు, క్రీడల మంత్రిత్వశాఖల ఆధ్వర్యంలో వై 20 ప్రోగ్రాంలో యువత ఆరోగ్యం, శ్రేయస్సు, క్రీడల అజెండాగా దేశం అంతటా ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఆదివారం ఉదయం 6 నుంచి 8 గంటల వరకు సర్పవరం జంక్షన్‌ నుంచి కాకినాడ వివేకానంద పార్కు వరకు ర్యాలీ జరుగుతుందని.. యువత, విద్యార్థులు భాగస్వాములు కావాలని కోరారు.

Updated Date - 2023-06-11T00:46:39+05:30 IST