అనపర్తి ఓట్లలో తేడా ఉంది..
ABN , First Publish Date - 2023-11-21T23:51:08+05:30 IST
కేంద్ర ఎన్నికల సంఘం గైడ్‌లైన్స్‌కు తిలోదకాలు ఇచ్చి రాష్ట్రంలో పూర్తిగా సీఎం జగన్ కనుసన్నల్లో అధికార యంత్రాంగం పనిచేస్తుందని అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు.

రాజమహేంద్రవరం సిటీ/రూరల్, నవంబరు 21: కేంద్ర ఎన్నికల సంఘం గైడ్‌లైన్స్‌కు తిలోదకాలు ఇచ్చి రాష్ట్రంలో పూర్తిగా సీఎం జగన్ కనుసన్నల్లో అధికార యంత్రాంగం పనిచేస్తుందని అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్‌లో మంగళవారం కలెక్టర్ డాక్టర్ కే.మాధవీలతను కలిసి అనపర్తి నియోజకవర్గంలో సవరించిన ఓటరు జాబితాలో లోపాలపై వివరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియ గందరగోళంగా ఉందన్నారు. అనపర్తి నియోజకవర్గంలో మా బీఎల్‌ఏలు అభ్యంతరాలు గ్రామ బీఎల్‌వోలకు చెప్పినా సరిచేయలేదని చెప్పారు. ఈ మేరకు జిల్లా ఎన్నికల అఽధికారిగా ఉన్న కలెక్టర్‌ను కలిసి 4500 ఓట్లలో తేడాను పరిశీలించాలని కలెక్టర్ లిస్ట్‌ను ఇచ్చామని చెప్పారు. రాష్ట్ర ఎన్నికల అధికారికి ఇస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆళ్ళ గోవింద్, సుధాకర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు దత్తుడు శ్రీను,తెలుగుయువత కార్యనిర్వాహక కార్యదర్శి బాసి పాల్గొన్నారు.