9 వరకు ఓటు నమోదు
ABN , First Publish Date - 2023-12-03T00:46:52+05:30 IST
ఓటు హక్కులేని ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత అన్నారు.
నిడదవోలు, డిసెంబరు 2 : ఓటు హక్కులేని ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత అన్నారు. నిడదవోలు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో శనివారం ఓటు హక్కు ఓటర్ల నమోదుపై నిర్వహి ంచిన అవగాహన సదస్సుకు హాజరై మాట్లాడారు. 2024 జనవరి ఒకటో తేదీకి 18 ఏళ్ళు నిండే వారంతా ముందస్తుగా ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు. డిసెంబరు 9వ తేదీ వరకు ఓటరు నమోదు కార్యక్రమం జరుగుతుందన్నారు. అనంతరం పట్టణంలోని బాలికోన్నత పాఠశాల,8వ నెంబరు సచి వాలయంలో జరుగుతున్న ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలను సందర్శించారు.ఆమె వెంట ఆర్డీవో కృష్ణనా యక్, నిడదవోలు ఇఆర్వో ఎం.ఝాన్సీరాణి,కమిషనర్ కెవి పద్మావతి, తహసీల్దార్ గంగరాజు ఉన్నారు.
ఓటు కోసం 7774 దరఖాస్తులు
రాజమహేంద్రవరం, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి) : జిల్లాలో శనివారం ప్రత్యేక ప్రచార దినోతవ్సవానికి ఓటర్ల నుంచి స్పందన వచ్చిందని, 1569 బూత్‌ల నుంచి మొత్తం ఫారం-6,7,8 దరఖాస్తులు 7774 వచ్చాయని కలెక్టర్ మాధవీలత తెలిపారు. ఫారం-6 కింద 4,682 దరఖాస్తులు, ఫారమ్- 7 కింద 780, ఫారం- 8 కింద 2312 దరరఖాస్తులు వచ్చాయన్నారు. అనపర్తిలో మొత్తం దరఖాస్తులు 828, రాజానగరం లో 956,రాజమహేంద్రవరం సిటీలో 1223, రాజమ హేంద్రవరం రూరల్‌లో 1813,కొవ్వూరులో 943, నిడ దవోలులో 880,గోపాలపురంలో 1131 దరఖాస్తులు వచ్చాయన్నారు.ఆదివారం కూడా స్వీకరిస్తామన్నారు.