వివేకానందుడి బాటలో సాగాలి

ABN , First Publish Date - 2023-01-26T00:10:04+05:30 IST

స్వామి వివేకానందుడి బాటలో నేటితరం ముందుకు సాగాలని ఏిపీ విద్యుత్‌ నియంత్రణ మండలి చైర్మన్‌, ఏపీ ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ సీవీ నాగార్జునరెడ్డి అన్నారు.

వివేకానందుడి బాటలో సాగాలి

అనపర్తి, జనవరి 25: స్వామి వివేకానందుడి బాటలో నేటితరం ముందుకు సాగాలని ఏిపీ విద్యుత్‌ నియంత్రణ మండలి చైర్మన్‌, ఏపీ ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ సీవీ నాగార్జునరెడ్డి అన్నారు.అనపర్తిలోని శ్రీరామకృష్ణ సేవాసమితి ఆధ్వర్యంలో స్థానిక జీబీఆర్‌ విద్యా సంస్థల ఓపెన్‌ ఆడిటోరియంలో బుధవారం స్వామి వివేకానంద జయం త్యుత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సంద ర్భంగా సమితి ఆధ్వర్యంలో నలుగురు ప్రము ఖులకు స్వామి వివేకానంద జీవన సాఫల్య పురస్కారాలను అందజేశారు. పురస్కార గ్రహీత శాంతా బయోటెక్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ కేఈ వరప్రసాదరెడ్డి ప్రసంగిస్తూ దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన స్వామీజీ భావజాలాన్ని ఎప్పటికీ మరువలేమన్నారు. మరో పురస్కార గ్రహీత కేన్సర్‌ శస్త్ర చికిత్స నిపుణుడు డాక్టర్‌ సింహాద్రి చంద్రశేఖరరావు మాట్లాడుతూ యువత జ్ఞానాన్ని పెంపొదించుకోవాలని, సంప్రదాయాలను పాటించాలని అపుడే వివేకానందుడు కలలుగన్న భారతావని ఆవిష్కా రమవుతుందన్నారు. అన్నమయ్య సంకీర్తనల స్వరకర్త ప్రముఖ గాయని డాక్టర్‌ శోభారాజ్‌ ప్రసంగిస్తూ సంకల్ప బలంతో సాధించలేనిది ఏదీ లేదని స్వామీజీ చెప్పిన మాటలను స్ఫూర్తిగా తీసుకుని జీవితాన్ని కొన సాగిస్తున్నానన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన రాజ మహేంద్రవరం రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామీ విని శ్చిలానందజీ మహరాజ్‌ మాట్లాడుతూ స్వామి వివేకా నందుని ఆశయాలను యువత ఆచరరణలో పెట్టాలని అప్పుడే ఉన్నత శిఖరాలను అధిరోహించడం సాధ్య పడుతుందన్నారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రసంగిస్తూ శ్రీరామకృష్ణ సేవా సమితి సేవలు అభినందనీయమని ప్రశంసించారు. రాజమహేంద్రవరం రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి వినిశ్చిలానందాజీ మహరాజ్‌, ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి నలుగురు ప్రముఖులకు స్వామి వివేకానంద జీవన సాఫల్య పురస్కారాలతో పాటు రూ.25 వేల నగదు అందజేసి సత్క రించారు. నగదు బహుమతులు అందుకున్న ప్రముఖులు నాగార్జునరెడ్డి, వరప్రసాదరెడ్డి, చంద్ర శేఖర రావులు తమకు అందించిన రూ.25వేల నగదుకు మరో మూడింతలు కలిపి సేవా కార్యక్రమాలకు విని యోగించాలంటూ తిరిగి సమితి ప్రతినిధులకు అందజేశారు. సమితి అధ్యక్షుడు పడాల సుబ్బారెడ్డి, పారిశ్రామికవేత్తలు మేడపాటి రామలింగారెడ్డి, తేతలి ఉపేంద్రరెడ్డి, హైకోర్టు న్యాయవాది నల్లమిల్లి శివారెడ్డి, రామకృష్ణ మఠం సభ్యుడు ఎం. దుర్గాప్రసాద్‌లతో పాటు సమితి ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-26T00:16:47+05:30 IST