విజయనగరం వద్ద రైలు ప్రమాదం
ABN , First Publish Date - 2023-10-30T00:32:02+05:30 IST
సామర్లకోట: విజయనగరం జిల్లా కొత్తవలస మండలం అలమండ- కంకటాలపల్ల్లి రైల్వే సెక్షన్ పరిధిలో ఆదివారం రాత్రి రెండు పాసింజర్ రైళ్లు పట్టాలు తప్పిన పెను ప్రమాద ం సంభవించింది.
రాజమండ్రి నుంచి ఏఆర్‌వీ రైలు
హెల్ప్ డెస్క్ ఏర్పాటు
రాజమహేంద్రవరం, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి)/సామర్లకోట: విజయనగరం జిల్లా కొత్తవలస మండలం అలమండ- కంకటాలపల్ల్లి రైల్వే సెక్షన్ పరిధిలో ఆదివారం రాత్రి రెండు పాసింజర్ రైళ్లు పట్టాలు తప్పిన పెను ప్రమాద ం సంభవించింది. ఈ మేరకు ప్రయాణికుల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసు కునేందుకు రాజమహేంద్రవరం, సామర్లకోటలో ప్రత్యేక హెల్ప్‌లైన్ సమాచార కేంద్రాలను ఏర్పాటు చేశారు. సహాయక చర్యల్లో భాగంగా రాజమహేంద్రవరం నుంచి యాక్సిడెంట్ రిలీఫ్ వ్యాన్‌ని (ఏఆర్‌వీ) పంపించారు. ట్రాక్ మరమ్మతులు, ప్రమాద సహాయక చర్యలకు సంబంధించిన సామగ్రి ఏఆర్‌వీలో ఉన్నాయి. రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్‌లో 0883 2420541 నంబరుతో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. రాజమహేంద్రవరం గుండా వెళ్లే రైలు నం. 18189 టాటా-ఎర్నాకుళం, 11020 భువనేశ్వర్-ముంబై, 12703 హౌరా-సికింద్రాబాద్, 12245 హౌరా-బెంగళూరు రైళ్లను విజయనగరం తర్వాత దారి మళ్లించారు. రైలు నం. 20809 నాందేడ్ ఎక్స్‌ప్రెస్, 12703 ఫలక్‌నుమా రైళ్లను టిట్లాగఢ్ మీదుగా నడుపుతున్నారు. 11020 కోనార్క్ రాజమండ్రి స్టేషను గుండా వెళ్లదని రైల్వే తెలిపింది. విజయవాడ నుంచి కూడా డీఆర్‌ఎం తమ సిబ్బందితో సంఘటనా ప్రదేశానికి ప్రత్యేక రైలులో బయలుదేరారు. అదే విఽధగా సామర్లకోటలో అత్యవసర హెల్ప్‌లైన్ సమాచార కేంద్రాన్ని 0884- 2327010ను ఏర్పాటు చేశారు. తునిలో 08854-252172 పేరిట హెల్ప్‌లైన్ ఏర్పాటుచేశారు. వీటి ద్వారా ఆయా రైళ్ళల్లో ప్రయాణం చేస్తున్న మన ప్రాంతానికి చెందిన వారి సమాచారం తెలుసుకోవచ్చని రైల్వే అధికారులు తెలిపారు. విశాఖ నుంచి పలాస వెళ్తున్న ప్రత్యేక పాసింజరు రైలు అలమండ సమీపాన సిగ్నల్ కోసం ఆగిఉన్న తరుణంలో అదే లైన్‌లో వెనుక నుంచి వస్తున్న విశాఖ -రాయగడ రైలు పాసింజరు రైలును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు రైల్వే ఉన్నతాధికారుల ద్వారా సమాచారం అందింది.
పలు రైళ్ల రాక ఆలస్యం
విశాఖ మీదుగా సామర్లకోట వైపునకు రావాల్సిన పలు రైళ్ల రాక తీవ్ర ఆలస్యంతో ఉన్నట్లు సామర్లకోట రైల్వే ఉన్నతాధికారి ఒకరు ఆదివారం రాత్రి ఆంధ్రజ్యోతికి తెలిపారు. వాటిలో రాత్రి సామర్లకోట చేరుకోవాల్సిన టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ రాత్రి 10.15 వరకూ సామర్లకోట చేరుకోలేదు.
ప్రమాద ఘటనపై హోం మంత్రి దిగ్ర్బాంతి
కొవ్వూరు, అక్టోబర్ 29 : విజయనగరం సమీపంలో జరిగిన రైలు ప్రమాద సంఘటనపై రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. ఇంకా వేగంగా సహాయక చర్యలు అందించేందుకు అన్నిశాఖల అధలికారులు సమన్వయంతో ముందుకు వెళ్లాలని ఆదేశించామన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు సిబ్బందిని తరలించాలని ఉన్నతాధికారులను ఆదేశించామన్నారు.
బి తదితరులు పాల్గొన్నారు.