‘వారాహి’ వస్తోంది!

ABN , First Publish Date - 2023-06-03T01:47:34+05:30 IST

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నికల వేడి మరింత రాజుకుంటోంది. ముందస్తు ఎన్నికలు ఏక్షణాన వచ్చినా ఢీకొనడానికి ప్రతిపక్ష టీడీపీ, జనసేనలు సై అంటుండడంతో క్షేత్రస్థాయిలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు వరుసగా కొన్ని రోజులపాటు జిల్లాలో పర్యటించి రాజకీయ వేడి పుట్టించారు. ఆ తర్వాత మహానాడు వేదికగా ఎన్నికల శంఖారావం పూరించారు.

‘వారాహి’ వస్తోంది!

  • ఈనెల 14 నుంచి ఉమ్మడి తూ.గో. జిల్లాలో పవన్‌కల్యాణ్‌ యాత్ర

  • ప్రత్తిపాడు నుంచి రాజోలు వరకు ఎనిమిది నియోజకవర్గాల్లో పర్యటన

  • ఒక్కో నియోజకవర్గంలో రెండు రోజులు.. మొత్తం16 రోజుల యాత్ర

  • తొలుత అన్నవరం సత్యదేవుడి దర్శనం.. కత్తిపూడిలో బహిరంగ సభ

  • పవన్‌ రాకతో ఉమ్మడి జిల్లాలో మరింత కాకెక్కనున్న రాజకీయాలు

  • గత నెలలో జిల్లాలో పర్యటించి ఎన్నికల వేడి రాజేసిన చంద్రబాబు

  • అటు రైతుపోరు, ఇటు మహానాడుతో మోగిన ఎన్నికల శంఖారావం

  • ఇప్పుడు పవన్‌ పర్యటనతో మరింత దద్దరిల్లనున్న జిల్లా రాజకీయాలు

  • ముందస్తు ఎన్నికలు రావొచ్చనే ఊహగానాలతో యాత్రల జోరు

  • ప్రతిపక్ష పార్టీల జోరును ఎదుర్కోలేక వైసీపీ బూతులతో దాడి

(కాకినాడ -ఆంధ్రజ్యోతి)

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నికల వేడి మరింత రాజుకుంటోంది. ముందస్తు ఎన్నికలు ఏక్షణాన వచ్చినా ఢీకొనడానికి ప్రతిపక్ష టీడీపీ, జనసేనలు సై అంటుండడంతో క్షేత్రస్థాయిలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు వరుసగా కొన్ని రోజులపాటు జిల్లాలో పర్యటించి రాజకీయ వేడి పుట్టించారు. ఆ తర్వాత మహానాడు వేదికగా ఎన్నికల శంఖారావం పూరించారు. మేనిఫెస్టో పథకాలు ప్రకటించి కాకరేపారు. ఇప్పుడు తాజాగా జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి వారాహి యాత్రకు శ్రీకారం చుట్టారు. దాదాపు పదహారు రోజులపాటు ఎని మిది నియోజకవర్గాల్లో పర్యటించడానికి షెడ్యూల్‌ ఖరారు చేశారు. కాకినాడ జిల్లా ప్రత్తి పాడు నుంచి కోనసీమ జిల్లా రాజోలు వరకు కొనసాగనున్న యాత్రలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి స్థానిక సమస్యలపై పోరాటం మొదలుపెట్టనున్నారు. దీంతో జిల్లాలో రాజకీయం మరింత రంజుగా మారనుంది. కాగా అటు టీడీపీ, ఇటు జనసేన జోరుతో అధికార వైసీపీలో గుబులు రేగుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నికల వేడి ఉమ్మడి తూర్పు గోదావరి నుంచి రాజుకుంటోంది. వరుస పెట్టి ప్రతిపక్ష పార్టీలు ఇక్కడి నుంచి ఎన్నికల శంఖారావం పూరిస్తుండడంతో రాజకీయ హడావుడి అంతకంతకూ పెరుగుతోంది. ఒక పక్క ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు ఏక్షణానైనా వస్తాయనే సంకేతాల నేపథ్యంలో ప్రతి పక్ష పార్టీలైన టీడీపీ, జనసేన జనంలో ముమ్మరంగా తిరుగుతూ అటు ప్రజా సమస్యలు, ఇటు ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం తీవ్రతరం చేశాయి. మొన్నటిమొన్న టీడీపీ అధి నేత చంద్రబాబు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. అకాల వర్షాలకు తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో వారి తరఫున చంద్ర బాబు మే నెల మొదటి వారంలో జిల్లాలో పర్యటించారు. కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించి రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడారు. దీంతో ప్రభుత్వం దిగి వచ్చింది. అయితే ఎన్నికలు జరగనున్న తరుణంలో చంద్రబాబు పర్యటనతో తమకు తీవ్ర నష్టం జరుగుతుందనే భయంతో ప్రభుత్వం ఎక్కిడికక్కడ చంద్రబాబు పర్యటనలకు ఆటంకం కలిగించింది. ఆయన పర్యటించే చోట ముందుగానే తడిచిన ధాన్యాన్ని కొనుగో లు చేసేసింది. ఆ తర్వాత గత నెల 27,28 తేదీల్లో రాజమహేంద్రవరం వేదికగా నిర్వహిం చిన మహానాడుతో జిల్లాలో మరింత రాజకీయ వేడి పెరిగింది. దీన్ని అడ్డుకోవడానికి వైసీ పీ అనేక కుట్రలు పన్నింది. ఈ ఆంక్షలన్నీ ఛేదించి లక్షల్లో జనం తరలివచ్చారు. అటు మహానాడు వేదికగా ఎన్నికల మేనిఫెస్టోకు సంబంధించి మహిళలు, యువత, అన్నదా తలు, పేదలకు చంద్రబాబు వరాల మూటలు ప్రకటించడం వైసీపీలో గుబులు రేపింది. అంతేకాకుండా పథకాల ప్రకటన ఎన్నికల వేడిని మరింత పెంచేసింది. ఈ కాక ఇంకా చల్లారకముందే ఇప్పుడు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ వారాహితో ముందుకు కదులుతున్నారు. మొన్న మే రెండో వారంలో పవన్‌ రాజమహేంద్రవరంలో పర్యటించా రు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై దుమ్మెత్తి పోశారు. ఆ తర్వాత ఇప్పుడు ఎన్నికలవేడిని మరింత పెంచేలా జిల్లాలో పదహారు రోజుల పర్యటనకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా ఈనెల 14న అన్నవరానికి రానున్నారు. అక్కడ సత్యదేవుడిని దర్శించుకున్న అనంతరం సాయంత్రం కత్తిపూడిలో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అక్కడి నుంచి ప్రత్తిపాడు నియోజకవర్గం మీదుగా పర్యటిస్తారు. ఒక్కో నియోజకవర్గంలో రెండు రోజుల పాటు పవన్‌ వారాహి యాత్ర కొనసాగనుంది. ప్రతి రోజు ఉదయం బస చేసిన ప్రాం తంలో స్థానిక సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారు. వీటి పరిష్కారానికి అక్కడి నుంచే ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తారు. అందులో తీవ్రమైన సమస్య ఉన్న చోటకు వెళ్లి పర్యటించనున్నట్టు జిల్లా పార్టీ వర్గాలు వివరించాయి. అంతేకాకుండా ప్రజాసమస్య లను తెలుకుని, వాటిపై పోరాడడమే లక్ష్యంగా కొనసాగనుంది. మరోపక్క నియోజకవ ర్గాల్లో యువత, మహిళలు, రైతుల కష్టాలను తెలుసుకోవడంతోపాటు కళాకారులు, మ త్స్యకారులు, భవన నిర్మాణ కార్మికులు ఇలా అన్ని వర్గాలతో మమేకం కానున్నారు. తొలు త ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి ప్రారంభం అయ్యే వారాహి యాత్ర ఆ తర్వాత పిఠాపురం, కాకినాడ రూరల్‌, కాకినాడ, ముమ్మిడివరం, అమలాపురం, పి.గన్నవరం, రాజో లు మీదుగా సాగనుంది. కాగా ఎక్కడికక్కడ ఒక్కో నియోజకవర్గంలో రెండేసి రోజులు పర్యటించనున్న పవన్‌ అన్ని రకాల సమస్యలపైనా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించడంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలపై సభల్లో ధ్వజమెత్తనున్నారు. పెరిగిన రాజకీయ కాకతో అధి కార వైసీపీకి దిక్కుతోచడం లేదు. చంద్రబాబు పర్యటనలతో అనూహ్య జనాదరణ రావ డంతో ఆ పార్టీ నేతలకు ఏం చేయాలోపాలుపోక బూతుల పంచాంగం విప్పుతున్నారు.

Updated Date - 2023-06-03T01:47:34+05:30 IST