వ్యాన్‌ కింద పడి ఇద్దరి మృతి

ABN , First Publish Date - 2023-08-22T00:30:41+05:30 IST

గోకవరం మండలంలోని తిరుమలాయపాలెం శివారులో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరి వ్యక్తులు మృతిచెందారు.

వ్యాన్‌ కింద పడి ఇద్దరి మృతి

గోకవరం, ఆగస్టు 21: గోకవరం మండలంలోని తిరుమలాయపాలెం శివారులో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరి వ్యక్తులు మృతిచెందారు. సామ ర్లకోటకు చెందిన గుమలాపురం శ్రీను(31), మిరియాల నాగు (29) వీరభద్రుడి సంబరం నిమిత్తం మోటార్‌ సైకిల్‌పై కోరుకొండ మండలం గుమ్ములూరు వెళ్లారు. తిరిగి స్వగ్రామం వెళ్తున్న క్రమంలో కడేలమ్మ ఆలయం సమీపంలో ఎదురుగా జామాయిల్‌ లోడుతో అతివేగంగా వస్తున్న ఐషర్‌ వ్యాన్‌ మోటార్‌సైకిల్‌ను ఢీకొని బోల్తా పడింది. దీంతో మోటార్‌సైకిల్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరూ వ్యాన్‌ కింద పడి అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికుల సహాయంతో పోలీసులు మృతదేహాలను వెలికితీశారు. కాగా గుమలాపురం శ్రీనుకు భార్య, ఇద్దరు కుమారులు ఉండగా, నాగుకు భార్య, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. గాయపడిన వ్యాన్‌ డ్రైవర్‌, క్లీనర్‌ను చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తర లించడంతో పాటు మృతదేహాలను కూడా తరలించారు. ఈమేరకు ఎస్‌ఐ నాగబాబు కేసు నమోదు చేశారు.

Updated Date - 2023-08-22T00:30:41+05:30 IST