వాడపల్లి వెంకన్న ఆలయం కిటకిట
ABN , First Publish Date - 2023-01-21T23:49:35+05:30 IST
కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీవేంక టేశ్వరస్వామి ఆలయానికి శనివారం భక్తజనం పోటెత్తారు.
ఆత్రేయపురం, జనవరి 21: కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీవేంక టేశ్వరస్వామి ఆలయానికి శనివారం భక్తజనం పోటెత్తారు. వేకువజామునే స్వామివారికి ఐశ్వర్యలక్ష్మీ హోమం, సుప్రభాతసేవ, నీరాజన మంత్రపుష్పం తదితర కార్యక్రమాలను శాస్ర్తోక్తంగా నిర్వహించారు. స్వర్ణ శోభితుడైన శ్రీవారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తజనం స్వామివారి తిరు వీధులలో ఏడు ప్రదక్షిణలు నిర్వహించుకుని మొక్కులు తీర్చుకున్నారు. భారీ క్యూలైన్ల ద్వారా గోవిందనామస్మరణతో స్వామివారిని దర్శించుకుని అన్న ప్రసాదం స్వీకరించారు. తలనీలాలు, తులాభారాలు, కానుకలు సమర్పించుకున్నారు. రాజమహేంద్రవరం ఉమా నృత్యనికేతన్ వారి ఆధ్వర్యంలో కూచిపూడి నృత్య ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది. వివిధ సేవల ద్వారా స్వామివారి ఒక్కరోజు ఆదాయం రూ.10,37,502 లభించినట్టు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్‌రాజు, ఈవో ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు.