ప్రకృతి సాగు దేశానికే గర్వకారణం : ఉత్తరప్రదేశ్ జీడీఎస్ ఎన్జీవోస్ బృందం
ABN , Publish Date - Dec 30 , 2023 | 01:37 AM
కడియం, డిసెంబరు 29: ఉభయగోదావరి జిల్లాలో రైతులు చేపట్టిన ప్రకృతి వ్యవసాయం దేశానికే గర్వకారణమని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర జీడీఎస్ ఎన్జీవోస్ బృంద సభ్యుడు అమితాబ్‌మిషార అన్నారు. శుక్రవారం మురమండ పాడిరైతు సాగు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ, పశుక్షేత్రాలను పరిశీలించారు. ప్రకృతి సేద్యంపై
కడియం, డిసెంబరు 29: ఉభయగోదావరి జిల్లాలో రైతులు చేపట్టిన ప్రకృతి వ్యవసాయం దేశానికే గర్వకారణమని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర జీడీఎస్ ఎన్జీవోస్ బృంద సభ్యుడు అమితాబ్‌మిషార అన్నారు. శుక్రవారం మురమండ పాడిరైతు సాగు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ, పశుక్షేత్రాలను పరిశీలించారు. ప్రకృతి సేద్యంపై రెండు రోజుల పర్యటనలో భాగంగా ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో పర్యటించిన ఉత్తరప్రదేశ్‌కి చెందిన జీడీఎస్ ఎన్జీవోస్ అమితాబ్‌మిషారా, సూర్యప్రతాప్‌సిన్హా, జయశంకర్ జోష్, భాస్కర్‌సిన్హా, ఓంప్రకాష్‌రాయ్ బృందం మురమండకు చెందిన పాడి రైతు మరిడి సత్యనారాయణ ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. ప్రకృతి సేద్యంపై జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు డైరెక్టర్ బి.తాతారావుతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సత్యనారాయణ మాట్లాడుతూ తాము పెంచుతున్న 80 గోవుల ద్వారా ఘన, ద్రవ, జీవామృతాలు తయారుచేసి వాటిని పంటకు వాడుతూ పూర్తిగా ప్రకృతి వ్యవసాయం సేద్యం చేస్తున్నామన్నారు. రసాయనిక ఎరువులతో పండించిన పంటతో పోలిస్తే ప్రకృతి వ్యయసాయంలో పంటకు మూడు బస్తాల మాత్రమే వ్య త్యాసం ఉందన్నారు. ఈ రకం వ్యవసాయాన్ని ఉత్తరప్రదేశ్‌లో ప్రవేశపెట్టనున్నట్టు బృంద సభ్యులు తెలిపారు.