జీపీఎస్‌ అంగీకరించే ప్రసక్తే లేదు..

ABN , First Publish Date - 2023-06-26T01:14:50+05:30 IST

ఉద్యోగ, ఉపాధ్యాయులు జీపీఎస్‌ను అంగీకరించే ప్రసక్తేలేదని యూటీఎఫ్‌ నాయకులు తెలిపారు. పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేసి న్యాయం చేయాలని కోరారు.

జీపీఎస్‌ అంగీకరించే ప్రసక్తే లేదు..
విద్యారంగాన్ని కాపాడుకుందాం పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న యూటీఎఫ్‌

రాజమహేంద్రవరం సిటీ, జూన్‌ 25 : ఉద్యోగ, ఉపాధ్యాయులు జీపీఎస్‌ను అంగీకరించే ప్రసక్తేలేదని యూటీఎఫ్‌ నాయకులు తెలిపారు. పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేసి న్యాయం చేయాలని కోరారు. ఎస్‌కేవీటి ఉన్నత పాఠశాలలో ఆదివారం జరిగిన యూటీఎఫ్‌ జిల్లా కార్యవర్గ సమావేశంలో ప్రభు త్వ విద్యారంగాన్ని కాపాడుకుందాం అనే కరపత్రాన్ని ఆవిష్కరించారు. అనం తరం జిల్లా అధ్యక్షుడు జయకర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం జీవో నెంబరు 117 పేరుతో పాఠశాలల వీలినం చేసి రేషనలైజేషన్‌ పేరుతో జీవోనెంబరు 59 ఇవ్వడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను పరోక్షంగా మూసివేయాలని ప్రయత్నించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నూతన విద్యాసంవత్సరం ప్రభు త్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదులో యూటీఎఫ్‌ కార్యకర్తలు ముందుండి ప్రభుత్వ పాఠశాలలను బ్రతికించాలని పిలుపునిచ్చారు. యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎన్‌.అరుణ మాట్లాడుతూ పీజీటీ పదోన్నతుల విషయంలో ఉపా ధ్యాయుల పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధి ప్రశ్నార్థకంగా ఉందన్నారు. మునిసిపల్‌ కార్పొరేషన్‌ పాఠశాలల్లో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు వెంటనే నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ప్రధాన కార్యదర్శి ఎ.షరీఫ్‌ మాట్లాడుతూ గత పీఆర్‌సీ బకాయిలను వెంటనే చెల్లించాలని,సరెండర్‌ లీవ్‌, పీఎఫ్‌, ఏపీజీఎల్‌ఐ నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం గౌరవాధ్యక్షుడు శంకరుడు, విజయగౌరి, కోశాధికారి ఈవీఎస్‌ఆర్‌.ప్రసాద్‌, జిల్లా కార్యదర్శులు ఎన్‌.రవిబాబు, రమణ, తాతారావు, ఎం.రవి, ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌ ఎం.శ్రీనివాస్‌, ప్రకాశరావు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T01:14:50+05:30 IST