గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2023-11-21T00:18:01+05:30 IST
కాకినాడ జిల్లా తుని నర్సీపట్నం రోడ్డులో డి.పోలవరం వద్ద సోమవారం ఉదయం వాకింగ్ చేస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం...

తుని రూరల్, నవంబరు 20: కాకినాడ జిల్లా తుని నర్సీపట్నం రోడ్డులో డి.పోలవరం వద్ద సోమవారం ఉదయం వాకింగ్ చేస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం... డి.పోలవరం గ్రామానికి చెందిన కోలిపర్తి కొండబాబు(55) ఉదయాన్నే డి.పోలవరం రోడ్డులో వాకింగ్ చేస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. అతనికి భార్యతో పాటుగా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చే సి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ విజయబాబు తెలిపారు.