ఉగాదికీ.. స్త్రళస్త్రలేనట్టే..

ABN , First Publish Date - 2023-03-19T02:25:03+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా జగనన్న కాలనీలను ప్రక టించింది. అందులో స్థలాలతోపాటు ఇళ్లూ తామే కట్టిస్తామని హామీ ఇచ్చింది.

ఉగాదికీ.. స్త్రళస్త్రలేనట్టే..
ద్వారపూడి శివారు వేములపల్లి లేఅవుట్‌లో పునాదుల దశ దాటని జగనన్నకాలనీ గృహాలు

జగనన్న కాలనీల్లో ముందుకుసాగని ఇళ్ల నిర్మాణం

సంక్రాంతి నుంచి ఉగాదికి మారిన ముహూర్తాలు

గడువు ముంచుకొస్తున్నా ఆసక్తిచూపని లబ్ధిదారులు

అది జరిగే పనికాదంటూ ఏప్రిల్‌ మొదటి వారానికి వాయిదా?

అటు ఉన్నతాధికారుల ఒత్తిడి, ఇటు లబ్ధిదారులు సహకరించక తల పట్టుకుంటున్న గృహనిర్మాణ శాఖ అధికారులు

మండపేట, మార్చి 18 : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా జగనన్న కాలనీలను ప్రక టించింది. అందులో స్థలాలతోపాటు ఇళ్లూ తామే కట్టిస్తామని హామీ ఇచ్చింది. తర్వాత లబ్ధిదారులే ఇళ్లు కట్టుకోవాలని, దానికి అవసరమైన కొంత సామగ్రి, నగదు తాము సమకూ రుస్తామని కొత్త పాట పాడింది. ప్రభుత్వమే తమకు గృహాలను నిర్మించి ఇస్తుందన్న ఆశతో ఉన్న లబ్ధిదారులకు తీవ్ర నిరాశ ఎదురైంది. సొంతంగా ఇళ్లు కట్టుకోవడానికి చాలామంది ముందుకు రాలేదు. దాంతో అధికారులతో ఒత్తిడి తెచ్చి కొందరు లబ్ధిదారులతో ఇళ్ల నిర్మాణం అక్కడక్కడ మొదలుపెట్టించారు. ప్రభుత్వ సాయం సరిపోక, ప్రైవేటు అప్పులు దొరకక వారిలో ఎక్కువ మంది మధ్యలోనే నిర్మాణ పనులు నిలిపివేశారు. అయినా ఏదోలా ఆ ఇళ్లను పూర్తి చేయించడానికి అధికార యంత్రాంగం రోజువారీ కసరత్తు చేస్తోంది. అయినప్పటికీ పనులు ముందుకు కదలడం లేదు. వాస్తవానికి ఈ ఏడాది సంక్రాంతి నాటికి జగనన్న కాలనీల్లో గృహాలను పూర్తి చేయించి అట్టహాసంగా పాలుపొంగించే కార్యక్రమం నిర్వహించా లని ప్రభుత్వం తలపోసింది. క్షేత్ర స్థాయిలో ఇళ్ల నిర్మాణం పడకేయడంతో వాయిదా వేసుకుని ఉగాదికి సామూహిక గృహప్రవేశాల కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించింది. జిల్లావ్యా ప్తంగా 243 లేఅవుట్లకు సంబంధించి 23,944 మంది లబ్ధిదారులకు గృహనిర్మాణ శాఖ ద్వారా ప్రభుత్వం గృహలను మంజూరుచేసింది. ప్రభుత్వం అందించే గృహనిర్మాణ రుణం చాలక పోవడం, లేఅవుట్లలో అరకొర వసతుల నడుమ లబ్ధిదారులు ఇళ్లను నిర్మించుకునేందుకు ఇప్పటికీ చాలామంది ఆసక్తి చూపించడం లేదు. ప్రస్తుతం ఉగాది నాటికి ఇళ్లను పూర్తి చేసి గృహప్రవేశాలు చేయించాలనే లక్ష్యంతో కొన్ని నెలలుగా అధికార యంత్రాంగం ప్రయ త్నాలు చేస్తోంది. మార్చి 22 ఉగాదికి జిల్లాలోని మొత్తం లేఅవుట్లలో 8620 గృహలను నిర్మా ణం పూర్తిచేయించి గృహ ప్రవేశాలకు సిద్ధంచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఇప్పటి వరకు కేవలం పూర్తయిన గృహాలు 4986 కాగా, ఇంకా పూర్తికావాల్సినవి 3684 ఉన్నాయి. ఇవన్నీ వారం రోజుల వ్యవధిలో పూర్తిచేయాల్సి ఉంది. అది సాధ్యమయ్యే పరిస్థితి లేకపోవ డంతో మరోసారి వాయిదాపడే అవకాశం ఉందని సమాచారం. ఉగాదికి బదులు ఏప్రిల్‌ మొదటి వారంలో సామూహిక గృహప్రవేశాలను ఏర్పాటుచేయాలని తెలిసింది. అది కూడా మరో పది రోజుల వ్యవధి మాత్రమే ఉండడంతో ఆ మేరకు గృహనిర్మాణాలు సాధ్యాసాధ్యా లపై చర్చ జరుగుతోంది. పైనుంచి ఒత్తిళ్లతో గృహ నిర్మాణశాఖధికారులు ఏం చేయాలో తెలి యక తలలు పట్టుకుంటున్నారు. గృహనిర్మాణాలు చేసుకునేందుకు లబ్ధిదారులు అసక్తిచూపక పోవడంతో కొన్నిచోట్ల అధికారులే బాధ్యతలు తీసుకుని బెస్‌మెంట్‌లు వేసి ఇళ్ల నిర్మాణం పను లకు శ్రీకారం చుడుతున్నారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఆప్షన్‌లలో మండపేట నియోజకవ ర్గంలో చాలామంది లబ్ధిదారులు తమకు ప్రభుత్వమే ఉచితంగా ఇంటిని నిర్మించి ఇచ్చేదానికి దరఖాస్తు చేసుకున్నారు. అదే ఇప్పుడు గృహనిర్మాణశాఖ అధికారులకు తలనొప్పిగా మారింది. లబ్ధిదారులు కనీసం తమకు నిర్మిస్తున్న ఇళ్లను కూడా చూసుకునేందుకు, తడుపుకునేందుకు కూడా రావడం లేదని గృహనిర్మాణశాఖాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. రామచంద్రపురం డివిజన్‌లో 2510 గృహలను పూర్తిచేసి లబ్ధిదారులతో సామూహిక గృహ ప్రవేశాలు చేయిం చాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఆయా లేఅవుట్లలో రహదారులు, మురుగుకాల్వలు, తాగునీటి సౌకర్యం లేకపోవడంతో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణానికి ముందుకు రావడం లేదు. మండపేటలో ఉగాదికి 2191 గృహాల నిర్మాణం పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్ప టివరకు 450 గృహాలను మాత్రమే నిర్మించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థంచేసుకోవచ్చు.

Updated Date - 2023-03-19T02:25:03+05:30 IST