‘లోవ’లో భక్తుల కోలాహలం
ABN , First Publish Date - 2023-12-11T00:23:36+05:30 IST
తుని రూరల్, డిసెంబరు 10: ప్రసిద్ధి పుణ్యక్షేత్రం లోవ దేవస్థానానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. అమ్మవారి దర్శనార్ధం తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. వేకువ జామున అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అర్చకస్వాము లు భక్తులకు దర్శన భాగ్యం క
తుని రూరల్, డిసెంబరు 10: ప్రసిద్ధి పుణ్యక్షేత్రం లోవ దేవస్థానానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. అమ్మవారి దర్శనార్ధం తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. వేకువ జామున అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అర్చకస్వాము లు భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు క్యూలలో బారులు తీరి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కుటుంబ సమేతంగా తరలివచ్చిన భక్తులు ఆల యప్రాంగణంలో దేవస్థానం ఏర్పాటు చేసిన వసతి గదుల్లో వంటావార్పులు చేసుకుని కుటుంబ సమేతంగా సహపంక్తిభోజనాలు చేశారు. భక్తుల కోసం ఆలయ ఈవో విశ్వనాధ రాజు ప్రత్యేక ఏర్పాట్లు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు.