సత్యం వధ ధర్మం చర
ABN , First Publish Date - 2023-09-26T01:26:12+05:30 IST
ఆధారాలు లేకుండా చంద్రబాబును అరెస్టు చేశారని, చట్టాలను చుట్టాలుగా చేసుకుని సీఎం జగన్ పరిపాలన చేస్తున్నాడని, సత్యం వధ ధర్మం చర అన్నట్టుగా కలియుగంలో గాని, ఏ యుగంలోగాని ప్రజలందరూ చైతన్యవంతులై పోరాటం కొనసాగిస్తారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కేఎస్ జవహర్ పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు చంద్రబాబుతో నేను కార్యక్రమంలో భాగంగా చేపట్టిన సామూహిక రిలే నిరాహార దీక్షలు సోమవారం కొనసాగాయి.

ప్రజలంతా చైతన్యవంతులై పోరాటం చేస్తారు
టీడీపీ జిల్లా అఽధ్యక్షుడు కేఎస్ జవహర్
పార్టీ అధినేత అక్రమ అరెస్ట్‌కు నిరసన
కొనసాగిన సామూహిక రిలే నిరాహార దీక్షలు
తాళ్లపూడి, సెప్టెంబరు 25: ఆధారాలు లేకుండా చంద్రబాబును అరెస్టు చేశారని, చట్టాలను చుట్టాలుగా చేసుకుని సీఎం జగన్ పరిపాలన చేస్తున్నాడని, సత్యం వధ ధర్మం చర అన్నట్టుగా కలియుగంలో గాని, ఏ యుగంలోగాని ప్రజలందరూ చైతన్యవంతులై పోరాటం కొనసాగిస్తారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కేఎస్ జవహర్ పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు చంద్రబాబుతో నేను కార్యక్రమంలో భాగంగా చేపట్టిన సామూహిక రిలే నిరాహార దీక్షలు సోమవారం కొనసాగాయి. తాళ్లపూడి మండలం ప్రక్కిలంకలో పెట్రోల్ బంకు ఆవరణలో టీడీపీ నియోజకవర్గ ద్విసభ్య కమిటీ ఆధ్వర్యంలో తెలుగుదేశం, జనసేన నాయకులు, కార్యకర్తలు సంయుక్తంగా రిలే నిరాహార దీక్ష చేపట్టారు. జవహర్ మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని, నిరాధారమైన కేసు లు పెట్టి, అరెస్టులు చేసి భయభ్రాంతున్ని చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నార న్నారు. నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యుడు జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి మాట్లాడుతూ రాష్ట్రంలో నియంతృత్వ పాలన కొనసాగుతోందని, అవినీతికి తావివ్వని తమ నాయకుడు చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని దేశ విదేశాల్లో ఉన్న వారంతా చూస్తున్నారన్నారు. మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు మాట్లాడుతూ విజన్-2020ని నిజం చేసిన చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపిన జగన్మోహన్‌రెడ్డి పరిపాలనకు చివరి రోజులు వచ్చాయ న్నారు. కార్యక్రమానికి విచ్చేసిన గోపాలపురం మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంక టేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని, 16 నెలలు జైలు జీవితం గడిపిన జగన్‌రెడ్డి ప్రతిపక్ష నాయకులంతా జైలు జీవితం గడపాలనే ఉద్దేశ్యంతో చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టారని, రాబో యే ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్తారన్నారు. కార్యక్ర మంలో నామన పరమేశ్వరరావు, కొఠారు వెంకట్రావు, గంటా శివరామకృష్ణ, చెట్టే సుభాషిణి, ఇల్లూరి బాబ్జి, తిగిరిపల్లి గోపి, కాకర్ల వంశి, బోడపాలి కాశీ, వెంపా నాగేశ్వరరావు, కె.కిరణ్‌కుమార్, సత్తిబాబు, పోసిబాబు, మణికంఠ పాల్గొన్నారు.