ట్రాక్టరు ఢీకొని టెన్త్‌ విద్యార్థిని మృతి

ABN , First Publish Date - 2023-06-03T01:29:49+05:30 IST

అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురంరూరల్‌ మండలం నడిపూడి లాకుల కు సమీ పంలో శుక్రవారం మధ్యాహ్నం ట్రాక్టరు ఢీకొన్న ఘటనలో నడిచి వెళుతున్న పదో తరగతి విద్యార్థిని పెనుమాల ప్రశాంతి (16)అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు విద్యార్థినులు గాయపడ్డారు.

ట్రాక్టరు ఢీకొని టెన్త్‌ విద్యార్థిని మృతి
ట్రాక్టరు ఢీకొని మృతిచెందిన పెనుమాల ప్రశాంతి

మరో ఇద్దరు విద్యార్థినులకు గాయాలు

ఆరుగంటలపాటు ఆందోళన

అమలాపురంరూరల్‌, జూన్‌ 2: అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురంరూరల్‌ మండలం నడిపూడి లాకుల కు సమీ పంలో శుక్రవారం మధ్యాహ్నం ట్రాక్టరు ఢీకొన్న ఘటనలో నడిచి వెళుతున్న పదో తరగతి విద్యార్థిని పెనుమాల ప్రశాంతి (16)అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు విద్యార్థినులు గాయపడ్డారు. గాయపడ్డ సరెళ్ల మానస, సత్యభవానీలను హుటాహుటీన 108 అం బులెన్సులో అమలాపురం ఏరియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. సమాచారం తెలు సుకున్న తా లూకా సీఐ పి.వీరబాబు, ఎస్‌ఐ అందే పరదేశీలు సిబ్బం దితో కలసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మరో నాలుగు అడుగులు ముందుకు నడిచి ఉంటే ఈ ప్ర మాదం తప్పేదని, మితిమీరిన వేగంతో వచ్చిన ట్రాక్టరు వెనుక నుంచి ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. నడిపూడి అప్పారి వారిపాలేనికి చెందిన ప్రశాంతి ఇటీ వల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో మ్యాథ్స్‌, సైన్స్‌ సబ్జెక్టులు తప్పింది. సప్లిమెంటరీ పరీక్షలకు హాల్‌టిక్కె ట్‌ను సైతం సిద్ధం చేశారు. శుక్రవారం ప్రత్యేక గణితం తరగతులకు వెళ్లి హాల్‌ టిక్కెట్లు తెచ్చుకోవలసి ఉంది. అయితే కుటుంబ అవసరాల కోసం సరుకుల కొనుగోలు కు తన స్నేహితురాళ్లతో కలసి లాకుల సమీ పంలో ఉన్న దుకాణంవద్దకు వచ్చి వాటిని కొనుగోలు చేసి తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. అప్పారి వారిపాలేనికి వెళ్లే చిన్న రహదారికి నాలుగు అడుగుల దూరంలోనే ఈ ప్రమాదం జరగడంతో ప్రశాంతి కు టుంబ సభ్యులు విలపిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది. నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్వకాలు జరపడంతో పాటు వాటిని ట్రాక్టర్లపై అక్రమంగా తరలి స్తుండడంవల్ల ఈ ప్రమాదం జరిగిందని స్థానికు లు ఆందోళనకు దిగారు. విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలంటూ బంధువర్గీయులు, స్థానికులు మధ్యా హ్నం నుంచి సాయంత్రం వరకు సుమారు 6 గంటల పాటు ఆందోళన చేశారు. చివరకు ఆ కుటు ంబానికి న్యాయం చేస్తామన్న హామీతో ఆందోళన విర మించారు. తాలూకా ఎస్‌ఐ పరదేశీ ఆధ్వర్యంలో శవపంచనామా పూర్తిచేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలిం చారు. ప్రశాంతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతురాలికి తల్లి విజయతో పాటు సోదరుడు మనోహర్‌ ఉన్నారు.

Updated Date - 2023-06-03T01:29:49+05:30 IST