తుఫాన్ భయం
ABN , First Publish Date - 2023-12-03T00:41:09+05:30 IST
అన్నదాతకు మళ్లీ కష్టాలే.. ఏ నిమిషతం ఏమవు తుందోనని ఆందోళనే.. పంట చేతికొస్తుందోలేదోననే ఆవేదనే. వాతావరణం మార్పులతో రైతులు, ప్రజ లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
నేటి నుంచి వర్షాలు పడే అవకాశం
జిల్లాలో సాగుతున్న కోతలు
వరి దిగుబడులపై ప్రభావం
ఆందోళనలో రైతాంగం
కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు
(రాజమహేంద్రవరం -ఆంధ్రజ్యోతి )/పెరవలి :
అన్నదాతకు మళ్లీ కష్టాలే.. ఏ నిమిషతం ఏమవు తుందోనని ఆందోళనే.. పంట చేతికొస్తుందోలేదోననే ఆవేదనే. వాతావరణం మార్పులతో రైతులు, ప్రజ లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వరి మాసూళ్లు సాగు తున్న సమయం కావడంతో ఏ నిమిషంలో ఎలా ఉంటుందోనని రైతాంగం భయపడుతున్నారు. ఆగ్నేయ బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ‘మిచౌంగ్’ తుఫాన్‌గా మారి విరుచుకుపడనుంది. ఈ నేపఽథ్యంలో ఆదివారం నుంచి జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే ఆకాశం మేఘావృతమైంది. ఇప్పటికే చలిగాలులు వీస్తున్నాయి. రాబోయే రెండు, మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వార్తలు వస్తుండడంపై భయపడుతు న్నా రు. కోతలు పూర్తయిన రైతులు తమ ధాన్యం ఏమవుతుందోనని ఆందోళన చెందుతుంటే కోయని రైతులు వరిచేలు పాడైపోతాయోమోనని ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఇంకా ఖరీఫ్ వరికోతలు పూర్తి కాలేదు. సుమా రు 70 శాతం వరకూ పూర్తయ్యా యి. ధాన్యం అధికంగా కళ్లాల్లోనే ఉంది. ఇప్పటి వరకూ 13,338 మంది నుంచి 89,927 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొను గోలు చేసినట్టు జేసీ ఎన్.తేజ్‌భరత్ తెలిపారు.మొత్తం 5 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అంచనావేయగా ,ప్రభుత్వం 2.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం గా పెట్టుకుంది.కానీ ఇంత వరకూ సగం కూడా పూర్తి కాలేదు. ఇంత వరకూ 8763 ఎఫ్‌టిఓలు సంబంధించి రూ.95 కోట్లు రైతుల ఖాతాలో జమ చేసినట్టు అధికారులు చెబుతున్నారు. తుఫాన్ ప్రభా వం వల్ల ఆదివారం నుంచి మంగళ వారం వరకూ రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ,అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు చెబు తున్నారు. కోస్తా తీరం వెంబడి ఆదివారం నుంచి 55 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఖరీఫ్ పంటల కోతల సమయం దృష్ట్యా రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
కంట్రోలు రూమ్‌ల ఏర్పాటు
జిల్లా , డివిజన్, మండల, స్థాయి యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, వారివారి ప్రధాన కార్యా లయాల్లో అందుబాటులో ఉండాలని కలెక్టర్ మాధవీ లత ఆదేశించారు.అత్యవసర సహాయం, వాతావరణ సమాచారం కోసం కంట్రోలు రూమ్‌లు ఏర్పాటు చేశామని తెలిపారు.. బొమ్మూరులోని కలెక్టరేట్ 89779 35609, రాజమహేంద్రవరం ఆర్డీవో కార్యాలయం 0883-2442344, కొవ్వూరు ఆర్డీవో కార్యాలయంలో 08813 231488 నెంబర్లకు సంప్రదించాలన్నారు.