మార్పు కోరుకుంటున్నారు

ABN , First Publish Date - 2023-03-19T01:00:25+05:30 IST

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తేటతెల్లమయ్యిందని టీడీపీ నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యులు జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి, కంఠమణి రామకృష్ణారావు అన్నారు.

మార్పు కోరుకుంటున్నారు

కొవ్వూరు, మార్చి 18: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తేటతెల్లమయ్యిందని టీడీపీ నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యులు జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి, కంఠమణి రామకృష్ణారావు అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయంపై హర్షం వ్యక్తం చేస్తూ పలుచోట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు శనివారం సంబ రాలు నిర్వహించారు. కొవ్వూరులోని టీడీపీ నియోజకవర్గ కార్యాలయంలో కేక్‌ కట్‌చేసి సంబరాలు నిర్వహించారు. ద్విసభ్య కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర, రాయలసీయ ప్రాంతాల్లో గ్రాడ్యుయేట్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంతో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఉత్తే జం నెలకొందన్నారు. జగన్మోహనరెడ్డి ప్రజా వ్యతిరేక పాలనపై ఇచ్చిన రిఫరెండమే ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలన్నారు. రాక్షసపాలనకు చరమగీతం పాడడానికి, వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నార న్నారు. అర్బన్‌ బ్యాంకు చైర్మన్‌ మద్దిపట్ల శివరామకృష్ణ మాట్లాడుతూ ఆచరణ సాధ్యం కాని కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్‌రెడ్డికి పట్టభద్రులు గుణపాఠం చెప్పారన్నారు. కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు దాయన రామకృష్ణ, సూరపనేని చిన్ని, పొట్రు శ్రీనివాసరావు, సూర్యదేవర రంజిత్‌, రాజాన శ్రీనివాస్‌, పెనుమాక జయరాజు, కాగిత రఘు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-19T01:00:25+05:30 IST