దేవాలయాల్లో అన్యమతస్థులను తొలగించాలి
ABN , First Publish Date - 2023-08-29T01:22:45+05:30 IST
హిందూ దేవాలయాల్లో అన్య మతస్థులను తొలగించకపోతే సీఎం జగన్‌కి ప్రజలు తగిన గుణపాఠం చెబు తారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలితోపాటు పలు దేవాలయాల్లో అన్యమతస్థులను, నిందితులను నియమించడాన్ని నిరసిస్తూ మన దేవాలయం -మన హక్కు నినాదంతో బీజేపీ నాయకులు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు.
లేకుంటే సీఎం జగన్‌కి తగిన గుణపాఠం తప్పదు: బీజేపీ
రాజమహేంద్రవరం, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): హిందూ దేవాలయాల్లో అన్య మతస్థులను తొలగించకపోతే సీఎం జగన్‌కి ప్రజలు తగిన గుణపాఠం చెబు తారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలితోపాటు పలు దేవాలయాల్లో అన్యమతస్థులను, నిందితులను నియమించడాన్ని నిరసిస్తూ మన దేవాలయం -మన హక్కు నినాదంతో బీజేపీ నాయకులు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వీర్రాజు మాట్లాడుతూ హిందూ దేవాలయాల్లో అన్యమతస్థులను నియమించడం, తాను క్రైస్తవ మతస్థుడనని డిక్లరేషన్‌లో తెలియజేసిన వ్యక్తికి టీటీడీ చైర్మన్ పదవి కట్టబెట్టడం దారుణమన్నారు. పాలకమండలిలో సభ్యులుగా నేరచరిత్ర ఉన్న వాళ్లను నియమించడం హేయ మన్నారు. ఇలాంటి చర్యలతో సీఎం జగన్ హిందువుల మనోభావాలను కించ పరచడమే కాకుండా అవమానిస్తున్నారన్నారు. అన్యమత ప్రచారాన్ని ప్రోత్స హించే విధంగా ప్రవర్తించడం బాధాకరమన్నారు. అన్నిహిందూ దేవాలయాల్లో హిందువులే ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని దేవాలయాల వద్ద భక్తుల నుంచి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఈ నెల 30వరకూ జరుగుతుందని తెలిపారు. అప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ హిందువులు, హిందూ దేవాలయాల పట్ల విద్వేషపూరిత చర్యలు చేపడుతోందని అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ యెనుముల రంగబాబు విమర్శించారు. అందరూ ఏకమై సీఎం జగన్‌కి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఉమా మార్కం డేయ, ఉమా కోటిలింగేశ్వర, సారంగధర దేవాలయాల వద్ద సంతకాలు స్వీక రించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బొమ్ముల దత్తు, రాష్ట్ర ఉపాధ్యక్షు రాలు రేలంగి శ్రీదేవి, ఓబీసీ జోనల్ ఇంచార్జి కురగంటి సతీశ్ తదితర నాయకులు పాల్గొన్నారు. అలాగే రూరల్‌లోని మల్లయ్యపేట శివాలయం, హకుం పేటలోని గణపతి ఆలయం, శాటిలైట్ సిటీ, బొమ్మూరు, ధవళేశ్వరం శివాలయాల వద్ద జరిగిన సంతకాల సేకరణ కార్యక్రమంలో యానాపు ఎన్‌వీబీఎన్ ఆచారి, సిద్ధాన్ని వెంకట్, తనుబుద్ధి సూర్య భాస్కరరావు పాల్గొన్నారు.