‘సమష్టి కృషితోనే నిర్బంధిత కార్మిక వ్యవస్థ నిర్మూలన సాధ్యం’

ABN , First Publish Date - 2023-02-02T01:48:29+05:30 IST

రాజమహేంద్రవరంలోని జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బుధవారం నిర్భందిత కార్మిక వ్యవస్థ, అక్రమ రవాణా నిర్మూలనపై న్యాయవిజ్ఞాన సదస్సు జరిగింది.

‘సమష్టి కృషితోనే   నిర్బంధిత కార్మిక వ్యవస్థ నిర్మూలన సాధ్యం’

రాజమహేంద్రవరం సిటీ, ఫిబ్రవరి 1: రాజమహేంద్రవరంలోని జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బుధవారం నిర్భందిత కార్మిక వ్యవస్థ, అక్రమ రవాణా నిర్మూలనపై న్యాయవిజ్ఞాన సదస్సు జరిగింది. డీఎల్‌ ఎస్‌ఎ, వన్‌స్టాప్‌ క్రైసిస్‌టీమ్‌ సంయుక్తంగా ఇంటర్నేషనల్‌ జస్టిస్‌ మిషన్‌ (ఐజెఎమ్‌)సహాకారంతో జరిగిన సదస్సులో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి కే ప్రత్యూషకుమారి మాట్లాడుతూ నల్లా వారి అక్రమ రవాణా బాధితులు, వాణిజ్యపరమైన లైంగిక దోపిడీ బాఽధితుల పథకం 2015 ద్వారా డీఎల్‌ఎస్‌ఏ అందిస్తున్న న్యాయసేవలు, వివిధ నేరాలకు గురైన బాధితులకు పరిహారం రీహేబిలిటేషన్‌ సౌకర్యాలను అందించడం గురించి వివరించారు. సమిష్టి కృషితోనే అక్రమ రవాణా, నిర్బంఽధిత కార్మిక వ్యవస్థ నిర్మూలన సాధ్యమని ఆ దిశగా పనిచేస్తున్న వన్‌స్టాప్‌ క్రైసిస్‌ టీం విధుల గురించి తెలిపారు. (ఐజెఎమ్‌)న్యాయవాది వి.నటరాజన్‌ మాట్లాడుతూ ఐపీసీ సెక్షన్‌ 370 నిర్బంఽధిత కార్మిక వ్యవస్థ నిర్మూలన చట్టం 1976 గురించి వివరించారు. ఐజెఎమ్‌ హెడ్‌ ప్రోగ్రామ్‌ పార్టనర్‌షిప్స్‌ ఎం.జేసుదాస్‌ మాట్లాడుతూ వన్‌స్టాప్‌క్రైసిస్‌ టీం అక్రమ రవాణాను నిర్మూలిస్తుందని చెప్పారు. రైల్వే రక్షక దళం ిసీఐ సైదయ్య మా ట్లాడుతూ రైల్వేస్టేషన్‌లో అక్రమ రవాణా ఎక్కువగా జరుతుందని తెలిపారు. ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రయాణించే సమయంలో ఎటువంటి అసౌకర్యం కలిగినా, అనుమానం వచ్చిన వెంటనే 139 రైల్వే టోల్‌ప్రీ నెంబరుకు ఫిర్యాదు చేయాలని కోరారు. ఈ సదస్సులో వన్‌స్టాప్‌ క్రైసీస్‌ టీమ్‌ సభ్యులు పానెల్‌ లాయర్‌ వి.సుజాత, పారా లీగల్‌ వలంటీర్‌ ఎల్‌ ఓంకార్‌, మెడికల్‌ ఆఫీసర్‌ బిఎస్‌ఎం వల్లి, తహశీల్దార్‌ భీమారావు, అసిస్టెంట్‌ సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ిపీవీడీ ప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-02-02T01:48:31+05:30 IST