ఉపాధ్యాయుల పెండింగ్‌ జీతాలు చెల్లించాలి

ABN , First Publish Date - 2023-08-19T00:51:13+05:30 IST

ఉపాధ్యాయులకు పెండింగ్‌ జీతాలను చెల్లించాలని డిమాండు చేస్తూ డీఈవో కార్యాలయం వద్ద శుక్రవారం ఫ్యాప్టో చైర్మన్‌ నాగిరెడ్డి శివప్రసాద్‌ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.

ఉపాధ్యాయుల పెండింగ్‌ జీతాలు చెల్లించాలి

అమలాపురం టౌన్‌, ఆగస్టు 18: ఉపాధ్యాయులకు పెండింగ్‌ జీతాలను చెల్లించాలని డిమాండు చేస్తూ డీఈవో కార్యాలయం వద్ద శుక్రవారం ఫ్యాప్టో చైర్మన్‌ నాగిరెడ్డి శివప్రసాద్‌ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు పూర్తయి 3నెలలు గడుస్తున్నా కేడర్‌ స్ర్టెంత్‌ పేరుతో నేటికీ జీతా లు చెల్లించకపోవడం శోచనీయమని చైర్మన్‌ శివప్ర సాద్‌, జన రల్‌సెక్రటరీ వీరభద్రరావు విమర్శించారు. వినతి పత్రాన్ని డీఈవో ఎం.కమలకుమారికి అందజేశారు. ఫ్యాప్టోకో చైర్మన్‌ ఎంటీవీ సుబ్బారావు, సరిదే సత్యపల్లంరాజు, నాయకులు కేదాశి శ్రీనివాస్‌, నందెపు శ్రీనివాస్‌గుప్తా, కేబీఎస్‌ ఎస్‌ఎంఎస్‌ శర్మ, పెన్నాడ శ్రీనివాస్‌, నల్లా రామకృష్ణ, కె.సత్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - 2023-08-19T00:51:13+05:30 IST