Share News

యువగళోత్సాహం

ABN , First Publish Date - 2023-12-03T01:05:10+05:30 IST

నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర దద్దరిల్లుతోంది. పోటెత్తుతున్న జన ప్రవాహంతో ఉత్సాహంగా ఉరకలు వేస్తూ ముందుకు సాగుతోంది. దారి పొడవునా మహి ళలు, వృద్ధులు, యువత, నిరుద్యోగులు, వివిధ సామా జిక వర్గాలు లోకేశ్‌ను పలకరిస్తూ ఆదరిస్తున్నారు. అడు గులో అడుగేస్తూ ముందుకు కదులుతున్నారు. అటు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానుల కోలాహలంతో పాదయాత్ర సందడిగా మారుతోంది.

యువగళోత్సాహం

  • పిఠాపురాన.. పోటెత్తిన జనం

  • ఉత్సాహంగా యువగళం

  • కదిలొచ్చిన ఊరూవాడా

  • పలకరింపులకు పోటీ

  • వెల్లువెత్తిన వినతులు

  • అండగా ఉంటామని హామీ

  • సెల్ఫీలతో యువత హల్‌సెల్‌

  • 19.8 కి.మీ సాగిన లోకేశ్‌ యాత్ర

(కాకినాడ,ఆంధ్రజ్యోతి)/పిఠాపురం:

నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర దద్దరిల్లుతోంది. పోటెత్తుతున్న జన ప్రవాహంతో ఉత్సాహంగా ఉరకలు వేస్తూ ముందుకు సాగుతోంది. దారి పొడవునా మహి ళలు, వృద్ధులు, యువత, నిరుద్యోగులు, వివిధ సామా జిక వర్గాలు లోకేశ్‌ను పలకరిస్తూ ఆదరిస్తున్నారు. అడు గులో అడుగేస్తూ ముందుకు కదులుతున్నారు. అటు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానుల కోలాహలంతో పాదయాత్ర సందడిగా మారుతోంది. ఎక్కడికక్కడ దారి పొడవునా భారీకటౌట్లు, ఫ్లెక్సీలు, వేలాది జెండాలు ప్రద ర్శిస్తుండడంతో రహదారులు పసుపుమయం అవుతు న్నాయి.215వ రోజు శనివారం ఉదయం 10.20 గంటలకు కాకినాడ రూరల్‌ పరిధిలోని యార్లగడ్డ గార్డెన్స్‌ నుంచి పాదయాత్ర ప్రారంభించారు. పెద్దాపురం ఎమ్మె ల్యే చినరాజప్ప, మాజీ ఎమ్మెల్యే కొండబాబు తదితరులు లోకేశ్‌ను కలిశారు. అనంతరం పార్టీ నేతలు, కార్యకర్తలతో సెల్ఫీలు తీయించుకున్నారు. అక్కడి నుంచి పాదయాత్ర పవర జంక్షన్‌ వరకు సాగి పెద్దాపురం నియోజకవర్గం పరిధిలోకి ప్రవేశించింది. దీంతో పెద్దాపురం టీడీపీ సీని యర్‌ నేత గుణ్ణం చంద్రమౌళి వందలాది మందితో హాజరై లోకేశ్‌కు భారీ స్వాగతం పలికారు. పెద్దఎత్తున బాణసంచా కాల్చుతూ వందలాది జెండాలను ప్రదర్శిం చారు. మౌళి, రాజప్ప తన యుడు రంగనాగ్‌, పెద్దాపురం జనసేన ఇన్‌ఛార్జి తుమ్మల బాబు, మాజీ మేయర్‌ సరోజ తదితరులు లోకేశ్‌తోపాటు నడిచారు. మధ్యాహ్నానికి పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని చిత్రాడకు పాద యాత్రగా చేరుకోగానే మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో వేలాది మంది లోకేశ్‌కు గజమాలలతో స్వాగతం పలికారు. వర్మ సతీమణి హారతి పట్టి స్వాగతిం చారు. వర్మ తనయుడు గిరీష్‌ వర్మను లోకేశ్‌ ఆప్యా యంగా పలకరించారు. అక్కడి నుంచి పిఠాపురం పాదగయ వరకు వేలాది మంది జనప్రవాహంతో పాద యాత్ర ముందుకు కదిలింది. ఊహి ంచని విధంగా వేలల్లో జనం పోటెత్తడంతో 216 జాతీయ రహదారిపై చాలా సేపు ట్రాఫిక్‌ స్తంభించి పోయింది.తిరిగి సాయంత్రం పిఠాపురం ఉప్పాడ సెంటర్‌ మీదుగా యాత్ర కొనసాగింది. అదే సమయంలో నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జి తంగెళ్ల ఉదయ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో జనసేన నేతలు, కార్యకర్తలు భారీ జెండాలతో లోకేశ్‌ పాదయాత్రకు హాజర య్యారు. సాయంత్రం పిఠాపురం ఉప్పాడ సెంటర్‌లో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. గొంతునొప్పి తీవ్రం కావడంతో సభను రద్దుచేశారు. పాదయాత్రలో వివిధ వర్గాల ప్రజలు లోకేశ్‌ను కలిసి వినతులు అందించారు. న్యాయవాదులు, దళిత సంఘాల నాయకులు, పైవేటు ఉపాధ్యాయులు, ముస్లిం సంఘాలు, పిఠాపురం ప్రజలు లోకేశ్‌ను కలిసి తమ సమస్యల మొర వినిపించారు. ఉప్పాడ సెంటర్‌ దాటిన తర్వాత రైల్వే గేటు పడడంతో కాసేపు ఆగి లోకేశ్‌ ముందుకు కదిలారు. అంబులెన్స్‌ వస్తుండడంతో స్వయంగా దారిచ్చారు. పిఠాపురం పట్టణం దాటిన తర్వాత రహదారులు అధ్వానంగా ఉండడంతో ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఓ చోట రహదారి గుంతను పూడ్చకపోవడంతో స్థానికులు గుంతలో కర్రముక్కను ఉంచి రాకపోకలు సాగిస్తుండడంతో వర్మతో కలిసి ఫొటో దిగారు.జగనన్న గుంతల పథకం విజయవంతంగా అమలవుతుందని ధ్వజమెత్తారు. శనివారం లోకేశ్‌ 19.8 కిలోమీటర్లు పాద యాత్ర చేశారు. మొత్తం పాదయాత్ర 2,964.4 కిలోమీ టర్లకు చేరుకుంది.పాదయాత్రలో శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌,అమలాపురం పార్లమెంట్‌ ఇన్‌ఛార్జి గంటి హరీష్‌, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, కాశీ న వీన్‌,సానా సతీష్‌,ఆదిరెడ్డి వాసు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-12-03T01:05:36+05:30 IST