మహా పండగ

ABN , First Publish Date - 2023-05-27T01:00:22+05:30 IST

పసుపు పండుగొచ్చేసింది.. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెం దిన తెలుగుదేశం పార్టీ అభిమానులు ప్రతిఏటా జరుపుకునే ‘మహానాడు’ పండుగ వచ్చేసింది. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్‌టీఆర్‌ జయంతి సందర్భంగా ప్రతి ఏటా మే 27, 28 తేదీల్లో నిర్వహించే మహానాడుకు ఈసారి పవిత్ర గోదావరి తీరంలోని రాజమహేంద్రవరం వేదికైంది.

మహా పండగ
మహానాడు వేదిక వద్ద సూచనలు చేస్తున్న చంద్రబాబు. చిత్రంలో గోరంట్ల, ప్రత్తిపాటి

పసుపుమయంగా రాజమహేంద్రి

సభాప్రాంగణంలో ఏర్పాట్లన్నీ పూర్తి

లక్షల్లో తరలిరానున్న తెలుగు తమ్ముళ్లు

ముందే చేరుకున్న ముఖ్య నేతలు

ఎక్కడికక్కడ బస, భోజన ఏర్పాట్లు

రాజమహేంద్రవరంలో వర్షం

వేమగిరిలో ఎండ

కలిసొచ్చిన వాతావరణం

(కాకినాడ/రాజమహేంద్రవరం/అమలాపురం - ఆంధ్రజ్యోతి)

పసుపు పండుగొచ్చేసింది.. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెం దిన తెలుగుదేశం పార్టీ అభిమానులు ప్రతిఏటా జరుపుకునే ‘మహానాడు’ పండుగ వచ్చేసింది. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్‌టీఆర్‌ జయంతి సందర్భంగా ప్రతి ఏటా మే 27, 28 తేదీల్లో నిర్వహించే మహానాడుకు ఈసారి పవిత్ర గోదావరి తీరంలోని రాజమహేంద్రవరం వేదికైంది. ఎక్కడికక్కడ పసుపు వర్ణశోభితమై తళతళలాడుతూ ఈ ప్రాంతమంతా పండగలా కనిపిస్తోంది. ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ జరుగుతోన్న ఈ మహానాడు రాజమహేంద్రవరానికి అత్యంత ప్రత్యేకమైనదిగా టీడీపీ భావిస్తోంది. రాజమహేంద్రవరం గడ్డ నుంచే గోదారమ్మ తల్లి సాక్షిగా ఎన్నికల సమరశంఖం పూరిం చడానికి సంసిద్ధమవుతోంది. మరోపక్క రెండురోజుల పండ గకు తెలుగుదేశం పార్టీ పూర్తిస్థాయిలో ఏర్పాట్లు పూర్తిచేసింది. దాదాపు 13 లక్షల మందికి సరిపడేలా సభావేదికలు సిద్ధం చేసింది. వేమగిరి జాతీయరహదారికి ఆనుకుని ఒకవైపు ప్రతి నిధుల సభ, మరోవైపు మహానాడు వేదికగా ఎన్టీఆర్‌ శత జయంతోత్సవ వేదిక సిద్ధంచేసింది. రెండు రోజుల మహానాడు పండగకు రాష్ట్రం నలుమూల అనేక జిల్లాల నుంచి పార్టీ మాజీ మం త్రులు,మాజీ ఎమ్మెల్యేలు,ఇతర ముఖ్యనేతలు, కార్యకర్తలు రాజమహేంద్రవరానికి తరలిరావడంతో నగరం కొత్తశోభ సంతరించుకుంది. అటు సభా వేదికలు సైతం పసు పువర్ణంతో మెరు స్తున్నాయి. కాగా తొలిరోజు మహానాడుకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా ఒక్కో నియోజక వర్గం నుంచి 20 వేల మంది వరకు పార్టీ నేతలు, అభిమా నులు, కార్యకర్తలు తరలివస్తున్నారు. మహానాడుకు వచ్చేవారికి ఆర్టీసీ నుంచి బస్సులు అడిగినా వైసీపీ ప్రభుత్వం ఇవ్వకుండా కక్షసాధి స్తోన్న నేపథ్యంలో కార్లు, బైకులు, ఇతర ప్రత్యామ్నాయ రవాణాతో లక్షల్లో మహానాడుకు చేరుకోవడానికి ఏర్పా ట్లు చేసుకున్నారు. సరిగ్గా శని వారం ఉదయం పదిన్నరకు మహానాడు తొలిరోజు కార్య క్రమం మొదలు కానుంది. లక్షల్లో హాజరయ్యే పార్టీ క్యాడర్‌ను ఉద్దేశించి టీడీపీ అధినేత చంద్రబాబు కీలక ప్రారంభోపన్యాసం చేయనున్నారు. ఎన్ని కలకు పార్టీ కేడర్‌ ఏవిధంగా సమాయత్తం కావాలో దిశా నిర్దేశం చేయనున్నారు. పార్టీకి ఎప్పుడూ కంచుకోటగా నిలిచే రాజమహేంద్రవరం వేదికగా ఎన్నికల శంఖారావం పూరించ నున్నారు. ఆ తర్వాత పార్టీ ఇదివరకే ప్రకటించిన అనేక అంశాలపై తీర్మానాలు చేయనున్నారు. మరోపక్క పాద యాత్రకు విరామం ఇచ్చి మహానాడు పండగకు హాజరు కానున్న లోకేశ్‌ ఏవిధంగా మాట్లాడతారనే దానిపై పార్టీ నేతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. .మహానాడుకు టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ కార్యదర్శి లోకేశ్‌ ముందుగానే శుక్రవారం సాయంత్రం రాజమహేంద్రవరానికి చేరుకున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు వీరిద్దరిని కలిసి పుష్పగుచ్ఛాలతో ముంచెత్తారు. ఇదంతా ఒకెత్తయితే లక్షల్లో తరలివచ్చే పార్టీ నేతలు,కార్య కర్తలు ఎక్కడా ఇబ్బంది పడ కుండా వేమగిరి సభా ప్రాంగ ణానికి సమీపంలో పదుల సంఖ్యలో పార్కింగ్‌ ప్రదేశాలను సిద్ధం చేశారు. ఒక్కో జిల్లాకు ఒక్కో ప్రాంతం కేటాయించారు. మరోపక్క ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల నుంచి వేలాదిమంది శుక్రవారం సాయంత్రానికే రాజమహేంద్రవరానికి చేరుకున్నారు. వారికి కేటాయించిన బస ప్రాంతాలకు వెళ్లారు. వీరంతా ఎక్కడా ఇబ్బంది పడకుండా పార్టీ అందరికీ వసతి,భోజనాలు ఏర్పాట్లు చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ, విదేశాల్లో స్థిరపడ్డ టీడీపీ అభిమానులు భారీగా తరలిరావడంతో ఉమ్మడి తూ ర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇళ్లన్నీ కళకళ లాడుతున్నాయి. సాధారణంగా పండుగలకు కుటుంబ సభ్యులు, బంధువులు వస్తుంటారు. కానీ మహానాడు పండుగకు పేరు మోసిన టీడీపీ నేతలు వారి అనుచరగణాలతో రెండు రోజులు వారి బంధుమిత్రుల ఇళ్లకు చేరుకుని ఆతిథ్యం పొందుతున్నారు. ఇప్పటికే అనేకమంది సమీపంలోని హోటళ్లు, రిసార్ట్స్‌లను బుక్‌ చేసుకున్నారు. రైల్వే స్టేషన్లు, బస్టాండులు టీడీపీ శ్రేణు లతో సందడిగా మారాయి. మహానాడు ముగిసిన తర్వాత గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లోని పర్యాటక ప్రదేశాలు, దేవాలయాలను చూసేందుకు ఆ పార్టీ శ్రేణులు ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నాయి. శని, ఆదివారాల్లో వేమగిరి కేంద్రంగా జరిగే మహానాడు కోసం భారీ ఏర్పాట్లు చేశారు. సిద్ధాంతం, కొవ్వూరు, కాకినాడ, ఏజెన్సీ ప్రాంతాల నుంచి మహానాడు ప్రాంగణానికి వచ్చే అన్ని రహ దారులను పసుపు జెండాలు, ఫ్లెక్సులు, కటౌట్లు, బ్యానర్లతో నింపేశారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, ప్రధాన కార్యదర్శి లోకేశ్‌, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సహా పలువురు నేతల భారీ ఫ్లెక్సీలతో కోల్‌కతా -చెన్నై రహదారికి ఇరువైపులా అలంకరణలు చేశారు. వేమగిరి సమీపంలో మహానాడు ప్రతి నిధుల సభకు సర్వ హంగులతో ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. మహానాడు ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో శుక్రవారం సాయంత్రం వరుణుడు కొంత భయపెట్టాడు. ముఖ్యంగా రాజమహేంద్రవరం నగరంలో భారీగా వర్షం కురిసింది. అదే సమయంలో వేమగిరిలో ఎండకాసింది. దీంతో ఆ పార్టీ నాయ కులు, ఏర్పాట్ల నిర్వాహకులు అంతా ఊపిరిపీల్చుకున్నారు.

మహానాడు నుంచే చంద్రబాబు దిశానిర్దేశం

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

రాజమహేంద్రవరంసిటీ/రూరల్‌/ధవళేశ్వరం/కడియం, మే 26: రాజమహేంద్రవరంలో జరుగుతున్న తెలుగుదేశం మహానాడు సభావేదిక ద్వారా కార్యకర్తలు, నాయకులకు టీడీపీ అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేస్తారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. మహానాడు ప్రతినిధుల సభావేదికను శుక్రవారం పరిశీలించి మాట్లాడారు. ఈ ఏడాది విజయదశమి నాడు టీడీపీ ముసాయిదా మేనిఫెస్టోను చంద్రబాబు విడుదల చేస్తారని తెలిపారు. ఎన్నికల్లోపు దీనిపై ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలు, సూచనలను పరిగణలోకి తీసుకుని ఎన్నికల ముందు తుది మేనిఫెస్టోను చంద్రబాబు ప్రకటిస్తా రని తెలిపారు. మహానాడుకు లక్షలాది మంది ప్రజలు, నాయకులు, కార్యకర్తలు తరలివస్తున్నారన్నారు. రవా ణా సదుపాయం కోసం ఆర్టీసీ ఎండీకి లేఖ రాసి డిపాజిట్లు కట్టేందుకు సిద్ధమైతే ప్రభుత్వం నుంచి ఒత్తిడి మేరకు ఆర్టీసీ బస్సులు ఇవ్వలేదన్నారు. ప్రైవేటు ట్రాన్స్‌పోర్టు యాజమాన్యాలను వైసీపీ బెదిరిస్తోందని ఆరో పించారు. ఎవరు ఎన్ని ఆటంకాలు సృష్టించినా ప్రజాభిమానంతో మహానాడు విజయవంతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం విజయాన్ని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు.

మహానాడు విజయాన్ని ఆపలేరు

ఎమ్మెల్యేలు గోరంట్ల, ఆదిరెడ్డి భవాని

టీడీపీ మహానాడును అడ్డుకోవాలని వైసీపీ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా తమ విజయాన్ని అడ్డుకోలేరని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని పేర్కొన్నారు. మహానాడుకు లక్షలాది మంది తరలివస్తున్నారన్నారు. నాలుగేళ్ల వైసీపీ పాలనలో ప్రజలు విసుగు చెందారని టీడీపీకి అధికారం అప్ప గించేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలిపారు. రాజమహేంద్రవరంలో మహానాడు నిర్వహించడం తమకు అనందంగా ఉందని చెప్పారు.

నేను బుల్లెట్‌ బండెక్కి వచ్చేత్తబా..

నేను బుల్లెట్‌ బండెక్కి వచ్చేత్తబా.. డుగ్గు..డుగ్గు అంటూ ఒక దివ్యాంగుడు రాజమహేంద్రవరంలో జరుగుతున్న మహానాడు వేడుకలో శుక్రవారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నరసరావుపేటకు చెందిన గోనుగుండ్ల కోటేశ్వరరావు తెలుగుదేశం వీరాభిమాని. అంతే కాదండోయ్‌.. టీడీపీ దివ్యాంగుల కమిటీ చైర్మన్‌ కూడా.. టీడీపీపై అభిమానంతో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బుల్లెట్‌ను పూర్తిగా పసుపురంగుతో మార్చి దానికి డెక్కర్‌ను అమర్చా రు. అదే బుల్లెట్‌పై రోడ్డు మార్గం గుండా రాజమహేంద్రవరం చేరుకున్నారు. పూర్తి పసుపుమయం, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ఆ బుల్లెట్‌పై ఉన్న కొటేషన్లు ఆకర్షణగా నిలిచాయి. కోటేశ్వరరావు మాట్లాడుతూ తాను 33 మహానాడుల్లో చేతక్‌ వాహనంపై పాల్గొన్నానని, ఈ మహానాడుకు బుల్లెట్‌ను సిద్ధం చేశానన్నారు. అయితే బుల్లెట్‌పై రావడానికి ఓ కారణం ఉందని తెలిపారు. ఈ వైసీపీ నాలుగేళ్ల అరాచక పాలనపై ప్రజలను చైతన్యపరుస్తూ 162 స్థానాల్లో టీడీపీ గెలుపొందాలనే నినాద ంతో మహానాడుకు బుల్లెట్‌పై వచ్చినట్టు తెలిపారు.

గోదావరి రుచులతో..

మండపేట, మే 26 : ఆహా ఏమి రుచి అనరా మైమరచి.. రోజూ తిన్నా మరి వద్దే అనరు మరి.. గోదావరి జిల్లాల అతిథి మర్యాదా మజాకానా.. పొట్టలు పగిలిపోవాల్సిందే.. మహానాడులో భాగంగా విందు ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. విజయవాడకు చెందిన అంబికా కేటరింగ్‌ ఆధ్వర్యంలో సుమారు 1500 మంది భోజన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. తొలి రోజైన శనివారం ఉదయం 10 వేల మందికి టిఫిన్‌ సిద్ధం చేస్తున్నారు. 50 వేల మందికి వివిధ రకాల గోదావరి వంటకాలతో విందు ఏర్పాటు చేస్తున్నారు. పూర్తి శాకాహారంతో కూడిన వంటకాలను శనివారం సిద్ధం చేస్తున్నట్టు ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు, జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు. గోదావరిలో లభించే స్వీట్ల ను అందించనున్నారు.

నేటి మెనూ ఇదే..

ఉదయం టిఫిన్‌ : పొంగలి, ఇడ్లీ, గారి, ఉప్మా

భోజనం : తాపేశ్వరం కాజా, యాపిల్‌ హల్వా, జిలేబి, వెజ్‌ బిరియాని, మిక్సిడ్‌ విజిటబుల్‌ కర్రీ, గుత్తివంకాయ గోంగూర కర్రీ, ములక్కాడ కర్రీ, బెండకాయ ఫ్రై, పప్పు మామిడికాయ, సాంబారు, మజ్జిగపులుసు, పెరుగు, ఐస్‌క్రీమ్‌.

ఏర్పాట్లను పరిశీలించిన నేతలు వీరే..

మహానాడు ఏర్పాట్లను టీడీపీ ముఖ్య నాయకులు శుక్రవారం పరిశీలించారు. రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, నిమ్మకాయల చినరాజప్ప, టీడీ జనార్దన్‌, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, రెడ్డి సుబ్రహణ్యం, మాజీ మంత్రులు కేఎస్‌ జవహర్‌, పీతల సుజాత, బం డారు సత్యనారాయణ, సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పట్టాభి, చిక్కాల రామచంద్రరావు, నన్నపనేని రాజకుమారి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, గన్ని కృష్ణ, వెలుగుబంటి ప్రసాద్‌, మార్గాని సత్యనారాయణ, అన్నందేవుల చంటి, యర్రా వేణుగోపాలరాయుడు, కాశి నవీన్‌కుమార్‌, వాసిరెడ్డి రాంబాబు తదితరులు ఉన్నారు..

Updated Date - 2023-05-27T01:00:22+05:30 IST