రైతుకు భరోసా లేదు.. రబీకి నీరూ అందదు..
ABN , First Publish Date - 2023-11-21T00:21:56+05:30 IST
రాష్ట్రంలో సీఎం జగన్ రైతు భరోసా విడుదలకు బటన్ నొక్కి 14 రోజులైనా ఇప్పటికి డబ్బులు పడలేదని అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాజానగరం నియోజకవర్గ ఇన్‌చార్జి బొడ్డు వెంకట రమణ అన్నారు.

రాజమహేంద్రవరం సిటీ/రూరల్, నవంబరు 20 : రాష్ట్రంలో సీఎం జగన్ రైతు భరోసా విడుదలకు బటన్ నొక్కి 14 రోజులైనా ఇప్పటికి డబ్బులు పడలేదని అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాజానగరం నియోజకవర్గ ఇన్‌చార్జి బొడ్డు వెంకట రమణ అన్నారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్ స్పందనలో కలెక్టర్ మాధవీలత, జేసీ తేజ్ భరత్‌లను కలిసి విన తి పత్రం అందజేశారు.ఈ నెల 15వ తేదీన సీఎం కిసాన్ విడు దల చేయగా రైతుల ఖాతాలకు జమైందని తెలిపారు. ఈ నెల 7వ తేదీన సీఎం బటన్ నొక్కినా నేటి వరకూ సొమ్ములు పడ లేదన్నారు. జిల్లాకు సంబంధించి లక్షా 41 వేల మంది రైతులు భరోసాకు ఎదురుచూస్తున్నారన్నారు. ప్రతి ఎకరాకు నీరు ఇస్తా మని ఐఏబీ సమావేశంలో స్పష్టంగా ప్రకటించారని ఉభయ జిల్లాలో 8.96 లక్షల ఎకరాలకు నీరందించాల్సిన బాధ్యత ఇరిగేషన్ అధికారులపై ఉందన్నా రు.అయితే 91 టీఎంసీల నీరు అవసరం కాగా కేవలం 21 టీఎంసీలు మాత్రమే ఉందన్నారు. గోదావరి అంతనీరు లేదన్నారు. రబీ సాగుకు నీటి ఎద్దడి తప్ప దన్నారు. రైతులను మోసం చేయకుండా స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు సిరపల్లి నాగేశ్వరరావు, జిల్లా వాణిజ్య విభాగం అధ్య క్షుడు సుధాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గంగాధర్ ,జిల్లా తెలుగు రైతు కార్యదర్శులు సుబ్బారెడ్డి, తాతారెడ్డి, రాఘవ, వీవీ. సత్యనారాయణ ,కేశవరావు, వీరబాబు, జాస్తి రాంబాబు, కొమ న్న రాం బాబు, రమణ, సర్వారాయుడు, సత్యనారాయణ పాల్గొన్నారు.