Share News

పసుపు సంబరం

ABN , First Publish Date - 2023-11-21T00:16:48+05:30 IST

న్యాయమే గెలిచింది..జై టీడీపీ.. జై చంద్రబాబు.. జైజై చంద్రబాబు అంటూ టీడీపీ నాయకులు నినాదాలతో హోరె త్తించారు.. చంద్రబాబు పూర్తిస్థాయి బెయిల్‌ రావడంపై టీడీపీ నాయకులు ఊరూవాడా సంబరాలు చేసుకున్నారు.

పసుపు సంబరం
రాజమహేంద్రవరంలో రోడ్డుపై నినాదాలు చేస్తున్న ఆదిరెడ్డి వాసు, అప్పారావు, టీడీపీ నాయకులు...

బాబుకు రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు

టీడీపీ నాయకుల హర్షం

స్వీట్లు పంపిణీ చేసిన నాయకులు

29 నుంచి జనంలోకి చంద్రబాబు

24 నుంచి లోకేశ్‌ పాదయాత్ర

(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)

న్యాయమే గెలిచింది..జై టీడీపీ.. జై చంద్రబాబు.. జైజై చంద్రబాబు అంటూ టీడీపీ నాయకులు నినాదాలతో హోరె త్తించారు.. చంద్రబాబు పూర్తిస్థాయి బెయిల్‌ రావడంపై టీడీపీ నాయకులు ఊరూవాడా సంబరాలు చేసుకున్నారు. స్కిల్‌ స్కామ్‌ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి హైకోర్టు రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేయడంపై ఆనందం వ్యక్తం చేశారు. చంద్ర బాబు స్కిల్‌ స్కామ్‌ కేసులో 53 రోజుల పాటు జ్యుడీషియల్‌ రిమాండ్‌ ఖైదీగా రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. సెప్టెంబరు 8న నంద్యాలలో చంద్ర బాబును అదుపులోకి తీసుకున్న సీఐడీ అధికారులు 10వ తేదీ అర్ధరాత్రి 1.20 గంటలకు రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలుకు తీసుకొచ్చారు.అప్పటి నుంచి 53 రోజుల పాటు గత నెల 31వ తేదీ వరకూ ఆయన జైలులో ఉన్నారు. ఆయన జైలు కనీస సౌకర్యాలు లేకపోవడంతో చాలా ఇబ్బందులకు గురయ్యారు.వాతావరణం సహకరించక ఒంటి నిండా దద్దుర్లు రావడం తదితర అనారోగ్య సమస్యలతో బాధప డ్డారు.ఎలర్జీ సమస్యతో శరీరమంతా దద్దుర్లు వచ్చినా, తొలుత అధికా రులు పట్టించుకోలేదు. ఆయన కంటికి ఆప రేషన్‌ చేయాలని వైద్యులు సూచించినా పట్టించుకోలేదు. చివరకు కోర్టు జోక్యం చేసుకుని వైద్యం నిమిత్తం అక్టోబరు 31 నుంచి ఈ నెల 28వ తేదీ వరకూ మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో 53 రోజుల తర్వాత అక్టోబరు 31న ఆయన విడుదలయ్యారు. దీంతో ఆయనకు అపూర్వ స్వాగతం లభించింది. చంద్రబాబు నాయుడు రాజమహేంద్రవరం నుంచి విజయవాడ వెళ్లడానికి సుమారు 14 గంటలు సమ యం పట్టింది. కానీ వైసీపీకి చెందిన కొందరు అది మధ్యంతర బెయిలేనని 28వతేదీన తిరిగి రాజ మహేంద్ర వరం సెంట్రల్‌ జైలుకు చంద్రబాబు రాకతప్పదని జోస్యం చెప్పారు. అయితే కోర్టు సోమవారం రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో 28న సెంట్రల్‌ జైలుకు రావాల్సిన అవసరం లేదు.పైగా 29న నుంచి ఆయన పార్టీ కార్యక్ర మాల్లో పాల్గొనవచ్చు. ఈ పరిణామాల నేపథ్యంలో టీడీపీ శ్రేణులు ఊరూవాడా సంబరాలు చేసుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా స్వీట్లు పంపిణీ చేశారు. ఆనందంతో మునిగి తేలారు.చంద్రబాబుకు రెగ్యులర్‌ బెయిల్‌ రావడంపై వైసీపీ లోని కొందరు ఏడుపులు పెడబొబ్బలు పెడుతున్నారు. ఎన్ని కల వరకూ చంద్రబాబును జైలులోని ఉంచి పబ్బంగడుపుకో వాలనుకున్న జగన్‌కు, వైసీపీ ప్రభుత్వానికి తల తీసేసినట్టు అయ్యింది. దీంతో తీవ్ర నిరా శకు గురయ్యారు. పైగా స్కిల్‌ కేసులో హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించగా,సుప్రీంకోర్టు ఈపిటిషన్‌ను స్వీకరించ లేదు. దీంతో వైసీపీకి చెందిన నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.చంద్రబాబును అరెస్ట్‌చేసి సమస్యలు తెచ్చుకున్నామని..వైసీపీ మరింత దిగజారిపోయిందని ఆందోళన చెందుతున్నారు.

బాబు చిత్రపటాలకు పాలాభిషేకం..

బాబుకు బెయిల్‌ రావడంతో టీడీపీ నాయకులు ఆనందం ఆకాశాన్నంటింది. పలుచోట్ల బాణసంచా కాల్చి సందడి చేశారు. రాజమహేంద్రవరంలో పెద్ద ఎత్తున నాయకులు రోడ్డుపైకి చేరుకుని న్యాయమే గెలిచిందంటూ నినాదాలు చేశారు. అన పర్తిలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పెద్ద తిరు పతి లడ్డూ ప్రసాదాన్ని ప్రజలకు పంపిణీ చేశారు. నిడదవోలు లో టీడీపీ నాయకులు కుందుల సత్యనారాయణ చంద్రబాబు ఫ్లెక్సీ పాలాభిషేకం చేశారు.గోపాలపురం నియోజకవర్గ ఇన్‌చార్జి మద్దిపాటి వెంకట రాజు దేవరపల్లిలో విక్టరీ సింబల్‌ చూపుతూ విజయానందం వ్యక్తం చేశారు.

ఆలస్యమైనా.. న్యాయమే గెలిచింది..

ఆలస్యమైనా న్యాయమే గెలిచింది.బెయిల్‌ పిటిషన్‌లో కూడా చంద్రబాబును కోర్టు ఏ 37 గానే పరిగణించింది. ఈ నెల 29 నుంచి చంద్రబాబు రాజకీయ కార్యక్రమాల్లో కూడా పాల్గొనవచ్చని స్పష్టం చేసింది. ఇటీవల సజ్జల, విజయసాయి రెడ్డి టీడీపీ పనైపోయింది..టీడీపీ జెండా పీకేస్తారంటూ వ్యాఖ్యలు చేశారు.. ప్రజలు వైసీపీ జెండా పీకేయడానికి సిద్ధంగా ఉన్నారన్న విషయం తెలుకోవాలి.

- నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే, అనపర్తి

29 నుంచి రాజకీయ ఆట ఆరంభం

ఆధారాలు లేని కేసులో.. రాజకీయ కక్షతో చంద్రబాబును 53 రోజులు అన్యాయంగా జైలులో పెట్టారు.. బెయిల్‌ రాకుండా అనేక కుట్రలు చేశారు. మాకు న్యాయస్థానాలపై నమ్మకం ఉంది.. చివరికి న్యాయమే గెలిచింది. ఈ నెల 29 నుంచి చంద్రబాబు బయటకు వస్తారు.అప్పుడు రాజకీయ ఆట ఆరంభమవుతుంది. ఈత నెల 24న యువగళం పాదయాత్ర పున:ప్రారంభమవుతుంది.. ఇక కాస్కోండి.

- ఆదిరెడ్డి వాసు, రాజమహేంద్రవరం

వైసీపీ తలదించుకోవాలి..

చంద్రబాబుకు రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేస్తూ న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలపై ఏమాత్రం సిగ్గున్నా సీఐడీ, వైసీపీ ప్రభుత్వం అవమానంతో తలదించుకోవాలి. స్కిల్‌డెవలప్‌మెంట్‌ కేసులో ఏ ఆధారాలు చూపలేదని కోర్టు స్పష్టంగా చెప్పింది. ఇంతకంటే ఏం కావాలి.

- మద్దిపాటి వెంకటరాజు, గోపాలపురం ఇన్‌చార్జి

బాబుకు బెయిల్‌ ఆనందాన్నిచ్చింది..

చంద్రబాబును అక్రమంగా 53 రోజులు జైలులో పెట్టారు. అనారోగ్యం కారణంగా చంద్రబాబుకు కోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. తిరిగి ఈనెల 28న చంద్రబాబును జైలుకు పంపించాలని రాష్ట్ర ప్రభుత్వం చాలా పన్నాగాలు పన్నింది. కాని హైకోర్టు రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేయడం చాలా ఆనందాన్నిచ్చింది.

- గన్ని కృష్ణ, రాజమహేంద్రవరం

అన్యాయం ఓడింది..

అధికార బలంతో చంద్రబాబు పై జగన్‌ అక్రమ కేసులు బనాయించి జైలులో పెట్టాడు.టీడీపీకి న్యాయవ్యవస్థపై గౌర వం ఉంది. అంతిమ విజయం వరకు ఓపిగ్గా పార్టీ నాయకులు ,కార్యకర్తలు వేచి ఉన్నారు..అన్యాయం ఓడింది.. న్యాయమే గెలిచింది. చంద్రబాబుకు పూర్తిస్థాయి బెయిల్‌ ఊరటనిచ్చింది.

- శిష్ట్లా లోహిత్‌, రాజమహేంద్రవరం

Updated Date - 2023-11-21T00:16:50+05:30 IST