టీడీపీ శ్రేణుల సంబరాలు

ABN , First Publish Date - 2023-03-19T00:27:23+05:30 IST

వైసీపీ సాగిస్తున్న అరాచకపాలనతో ప్రజలంతా విసిగిపోయి ఉన్నారని, అదే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిబింబించిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎ్‌సఎన్‌ వర్మ తెలిపారు. పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పిఠాపురం కోటగు మ్మం సెంటర్‌లో వర్మ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించి స్వీట్లు పంపిణీ చేశారు. వర్మ మాట్లాడుతూ ఎ

టీడీపీ శ్రేణుల సంబరాలు
పిఠాపురంలో స్వీట్‌ తినిపిస్తున్న మాజీ ఎమ్మెల్యే వర్మ

పిఠాపురం, మార్చి 18: వైసీపీ సాగిస్తున్న అరాచకపాలనతో ప్రజలంతా విసిగిపోయి ఉన్నారని, అదే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిబింబించిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎ్‌సఎన్‌ వర్మ తెలిపారు. పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పిఠాపురం కోటగు మ్మం సెంటర్‌లో వర్మ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించి స్వీట్లు పంపిణీ చేశారు. వర్మ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ అనేక అక్రమాలకు పాల్పడిందని, దొంగ ఓట్లు వేశారని, కనీసం పది చదవని వారికి సైతం ఓటు హక్కు కల్పించాలని, ఓటర్లను పలురకాల ప్రలోభాలకు గురిచేశారని ఆరోపించారు. ఇన్ని అరాచకాలకు పాల్పడిన ప్రజలు మాత్రం స్పష్టమైన తీర్పు ఇచ్చారని తెలిపా రు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ప్రజలంతా బలంగా కోరుకుంటున్నారని, అదే తీర్పును ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇచ్చారని చెప్పారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందులతో సహా 175 నియోజకవర్గాల్లో టీడీపీ విజయం సాధిస్తుందని దీమా వ్యక్తం చేశారు

‘వైసీపీలో వణుకు’

తుని, మార్చి 18: రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో వైసీపీ నేతల్లో వణుకుపుడుతోందని జిల్లా తెలుగుయువత అధ్యక్షుడు యనమల శివరామకృష్ణన్‌ పేర్కొన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో పట్టభద్రుల ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించినందుకు కేక్‌ కట్‌చేసి టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. అధికార మదంతో కొట్టుమిట్టాడుతున్న వైసీపీ నేతలు ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని లేదంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరింత ఘోరంగా ఓడిపోతారని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణాఽధ్యక్షుడు యినుగంటి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి మళ్ళ గణేష్‌, కుక్కడపు బాలాజీ, నెల్లిపూడి బ్రహ్మాజీ, గుడివాడ అప్పలనాయుడు, దిబ్బ శ్రీను, లంక సునీల్‌, దంతులూరి శ్రీనివాసరాజు, అల్లు రాజు, కుండల పెదబాబు, గురుమూర్తి, తాటిక సురే ష్‌, గెడ్డమూరి శివ, పల్లెల నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-19T00:27:23+05:30 IST