అర్హులకు ఇళ్ల పట్టాలివ్వాలి

ABN , First Publish Date - 2023-04-03T00:21:36+05:30 IST

35 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చామంటూ గొప్పలు చెప్పుకుంటున్న వైసీపీ ప్రభుత్వం అర్హులైన వారు ఇంకా మిగిలే ఉన్నారని వారికి పట్టాలు ఇచ్చేంత వరకు పోరాటం చేస్తామని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యో తుల నెహ్రూ అన్నారు. జగపతినగరం గ్రామంలో ఆదివారం ఆళ్ళ నానాజీ, ఆళ్ళ శ్రీమ

అర్హులకు ఇళ్ల పట్టాలివ్వాలి
సమావేశంలో మాట్లాడుతున్న నెహ్రూ

టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ

ప్రత్తిపాడు, ఏప్రిల్‌ 2: 35 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చామంటూ గొప్పలు చెప్పుకుంటున్న వైసీపీ ప్రభుత్వం అర్హులైన వారు ఇంకా మిగిలే ఉన్నారని వారికి పట్టాలు ఇచ్చేంత వరకు పోరాటం చేస్తామని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యో తుల నెహ్రూ అన్నారు. జగపతినగరం గ్రామంలో ఆదివారం ఆళ్ళ నానాజీ, ఆళ్ళ శ్రీమన్నారాయణ స్వగృహంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగపతినగరం శివారున కోర్టు పరిధిలో ఉన్న స్థలాలను పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామంటూ మహత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కోట్లు నిధులు దుర్వినియోగం చేశారని ఆ రోపించారు. ఈ విషయంపై తహశీల్దార్‌, ఎంపీడీవో, ఏపీవో సమాధానం చెప్పాలన్నారు. ఎమ్మెల్యే కూడా ఈ సమస్య పరిష్కరించకుండా పట్టా ఆశపెట్టడం సరికాదన్నారు. లబ్ధిదారులకు స్థలాలు కేటాయించేంతవరకు ఊరోకోమని చెప్పారు.

అంతమకుందు నెహ్రూ జగపతినగరం పెద్ద రామాలయంలో పట్టాభి సీతారామస్వామివారిని దర్శించుకుని పూజ లు చేశారు. టీడీపీ మండలాధ్యక్షుడు చదరం చంటిబాబు, గుడాల రాంబాబు, కొర్ల చినబాబు, ఎంపీటీసీ కాళ్ళ దొంగబాబు, బొదిరెడ ్లసుబ్బారావు, కాకిలేటి రాయుడు ఉన్నారు.

Updated Date - 2023-04-03T00:21:36+05:30 IST