వచ్చేది టీడీపీ, జనసేన కూటమి ప్రభుత్వం
ABN , First Publish Date - 2023-12-03T01:37:05+05:30 IST
వచ్చేది టీడీపీ, జనసేన కూటమి ప్రభుత్వం
మండపేట, డిసెంబరు 2: వైసీపీప్రభుత్వానికి నూకలు చెల్లాయని రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలుజరిగినా రాష్ట్రంలో ప్రజలు టీడీపీ, జనసేన సంకీర్ణ ప్రభుత్వానికి పట్టం కట్టేందుకు సిద్దంగా వున్నారని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వర రావు అన్నారు. శనివారం స్థానిక 26,27, 28 వార్డుల్లో టీడీపీ వార్డు ఇన్‌చార్జిలతో కలిసి బాబు ష్యూరిటీ భవి ష్యత్‌కు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షిణించాయని, ప్రజలకు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, అత్యాచారాలు, అరాచకాలు పెరిగిపోయాయని ఆరోపించారు. రాష్ట్రంలో సమగ్ర అభి వృద్ధి జరగాలంటే సీఎంగా చంద్రబాబు కావాలన్నారు. రైతుల పొలాలకు విద్యుత్ మోటార్లు టీడీపీ ఉచితంగా ఇస్తే, ఇపుడు జగన్ ప్రభుత్వం మీటర్లు బిగించి రైతులను నట్టేట ముంచిందన్నారు. టీడీపీ నాయకులు, వార్డు ఇన్‌చార్జిలు తదితరులు పాల్గొన్నారు.