విజయోత్సాహం!
ABN , First Publish Date - 2023-03-19T02:16:54+05:30 IST
రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు మూడింటినీ గెలుచుకోవడంతో జిల్లాలోని టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

ఫైనల్స్‌లోనూ టీడీపీదే విజయం
అమలాపురం టౌన్, మార్చి 18: రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు మూడింటినీ గెలుచుకోవడంతో జిల్లాలోని టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. వైసీపీ అరాచక పాలనపై ప్రజలు ఇచ్చిన తీర్పు ఇదని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. జిల్లా నుంచి ఎమ్మెల్సీ ఎన్నికలకు పరిశీలకులుగా వెళ్లిన వారిని పార్టీ నాయకులు సత్కరించారు. పలుచోట్ల కేక్‌లు కట్ చేసి వేడుకలు చేసుకున్నారు.చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని గుర్తించి విద్యావంతులైన పట్టభద్రులు టీడీపీ ఎమ్మెల్సీలను గెలిపించారని టీడీపీ అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి అయితాబత్తుల ఆనం దరావు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు పేర్కొన్నారు. అమ లాపురంలో శనివారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ గెలుపు కోసం తొక్కని అడ్డదారులు లేవని, చివరకు టీడీపీ అభ్యర్థులే విజయం సాధించారన్నారు. తొమ్మిది జిల్లాల్లో 108 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సెమీ ఫైనల్స్ అని ప్రకటించిన అధికార వైసీపీ నాయకుల చెంప చెల్లుమనిపించేలా విద్యావంతులు తీర్పునిచ్చారన్నారు. సెమీఫైనల్స్‌లోనే కాదు ఫైనల్స్‌లో కూడా విజయం టీడీపీదేనన్నారు. చిత్తూరు జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థుల విజయం కోసం కృషిచేసిన మాజీ ఎమ్మెల్యే ఆనందరావు, రమణబాబులను నాయకులు రాజులపూడి భీముడు, వాసురాజు ఆధ్వర్యంలో సత్కరించారు. పట్టణశాఖ అధ్యక్షుడు తిక్కిరెడ్డి నేతాజీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి పెచ్చెట్టి చంద్రమౌళి, తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు పెచ్చెట్టి విజయలక్ష్మి, జిల్లా ప్రధాన కార్యదర్శ అల్లాడ స్వామినాయుడు, నేతలు దెందు కూరి సత్తిబాబురాజు, పరమట శ్యామ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.