30న టీడీపీ చైతన్య రథయాత్ర
ABN , First Publish Date - 2023-06-26T00:21:49+05:30 IST
పెదపూడి, జూన్ 25: అనపర్తి నియోజకవర్గం వడిశలేరు నుంచి రంగంపేట, బిక్కవోలు, జి.మామిడాడ వరకు ఈనెల 30న జరిగే భవిష్యత్‌కు గ్యారంటీ చైతన్య రథయాత్రను విజయవంతం చేయాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. చైతన్య యాత్ర అనంతరం జీ.మామిడాడలో నిర్వహించబోయే బహిరంగ సభకు జీ.మామిడాడలోని గండ్రేడు, పెద్దా డ రోడ్డులలోని స్థలాలను ఆయన టీడీపీ శ్రేణులతో కలసి ఆదివారం పరిశీలించారు.
రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
పెదపూడి, జూన్ 25: అనపర్తి నియోజకవర్గం వడిశలేరు నుంచి రంగంపేట, బిక్కవోలు, జి.మామిడాడ వరకు ఈనెల 30న జరిగే భవిష్యత్‌కు గ్యారంటీ చైతన్య రథయాత్రను విజయవంతం చేయాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. చైతన్య యాత్ర అనంతరం జీ.మామిడాడలో నిర్వహించబోయే బహిరంగ సభకు జీ.మామిడాడలోని గండ్రేడు, పెద్దా డ రోడ్డులలోని స్థలాలను ఆయన టీడీపీ శ్రేణులతో కలసి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల రాజమహేంద్రవరంలో జరిగిన మహానాడులో 6 పథకాలను మి నీ మేనిఫేస్టోగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు ప్రకటించారన్నారు. ఈ పథకాలను ప్రజలకు వివరిస్తూ లోతుగా ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి చైతన్య రథయాత్రను జోన్‌లు వారీగా చేపడుతున్నామన్నారు. జోన్-2లో భాగంగా ఉభయగోదావరి జిల్లాల టీడీపీ ఇన్‌చార్జ్‌లు, ముఖ్య నాయకులు అందరూ సమష్టిగా ఈకార్యక్రమం లో పాల్గొని పథకాలను ప్రజలకు వివరిస్తానని తెలిపారు. పథకాల విస్తృత ప్రచారం కోసం పార్టీ కార్యకర్తలతో పాటు, టీడీపీ మహిళామణులు బాధ్యత వహించాలని ఆయన కోరారు. టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి పుట్టా గంగాధరచౌదరి, తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యక్షులు గణేష్ రెడ్డి, మండలాధ్యక్షులు జుత్తుగ కృష్ణ, నా యకులు ఆరుమిల్లి అమ్మన్న చౌదరి, తిబిరిశెట్టి గణేష్, ఈశ్వరరెడ్డి, వెంకటరామారెడ్డి, సిరసపల్లి నాగేశ్వరరావు, ఆప్పారెడ్డి, గోపీకృష్ణారెడ్డి ఉన్నారు.