‘ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి’

ABN , First Publish Date - 2023-03-19T00:20:22+05:30 IST

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. శనివారం అనపర్తి గాంధీబొమ్మ సెం టర్‌లో జరిగిన ఎమ్మెల్సీ విజయోత్సవ సభ అనంతరం పెదపూడి మండల టీడీపీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఆయన మా

‘ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి’

పెదపూడి, మార్చి 18: ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. శనివారం అనపర్తి గాంధీబొమ్మ సెం టర్‌లో జరిగిన ఎమ్మెల్సీ విజయోత్సవ సభ అనంతరం పెదపూడి మండల టీడీపీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఇదేం ఖర్మ-మన రాష్ర్టానికి కార్యక్రమాన్ని ప్రారంభించిన నాటి నుంచి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లడంతో ఆ ప్రభావం, ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు విజయఢంకా మోగించారన్నారు. ఈ విజయస్ఫూర్తితో మరింతగా ఈ కార్యక్రమం చేపట్టి ప్రజలను చైతన్యపరచాలన్నారు. నాయకులు జుత్తగ కృష్ణ, చిర్రా వరప్రసాదరావు, టేకుమూడి రాంబాబు, మెర్ల ప్రభాకర చౌదరి, అరుమిల్లి అమ్మన్న చౌదరి, మూకల శ్రీరాములు, కరకుదురు దత్తుడు, వనుం వెంకటరమణ, కేతా సత్యనారాయణ, పలివెల బుజ్జి, కాకర గోవిందు,అప్పన్న ఉన్నారు.

Updated Date - 2023-03-19T00:20:22+05:30 IST