వేసవిలో సాగు, తాగునీటి ఇబ్బంది రాకుండా అవసరమైన చర్యలు చేపట్టాలి
ABN , First Publish Date - 2023-03-19T02:36:39+05:30 IST
వేసవిలో సాగు, తాగునీటి ఇబ్బంది రా కుండా నిర్దిష్ట ప్రణాళికలను అమలు చేసేలా అధికారులు చర్యలు చేప ట్టాలని జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అధికా రులను ఆదేశించారు. శ

జడ్పీ చైర్మన్ వేణుగోపాలరావు
కాకినాడ సిటీ, మార్చి 18: వేసవిలో సాగు, తాగునీటి ఇబ్బంది రా కుండా నిర్దిష్ట ప్రణాళికలను అమలు చేసేలా అధికారులు చర్యలు చేప ట్టాలని జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అధికా రులను ఆదేశించారు. శనివారం కాకినాడజిల్లా ప్రజా పరిషత్ కార్యాల యంలో జరిగిన స్థాయీ సంఘాల సమా వేశాలలో జడ్పీ చైర్మన్ వేణుగోపాలరావు, వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు, స్థాయీ సంఘం చైర్‌పర్సన్ రొంగల పద్మలత, వివిధ స్థాయీ సంఘాల సభ్యులు, సం బఽంధిత శాఖల అధికారులు, హాజరయ్యారు. ఆర్థిక, ప్రణాళిక, గ్రామీణా భివృద్ధి, విద్య, వైద్యం, గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్యం, స్వచ్ఛ సంక ల్పం, జాతీయ ఉపాఽధి హామీ పథకం, హౌసింగ్, గ్రామీణ అభివృద్ధిలో ఇంతవరకు జరిగిన పురోగతి, కొత్తగా ప్రతిపాదించిన పనులు, సభ్యులు లేవనెత్తిన అంశాలపై సంబంధిత శాఖల అధికారులు తీసుకున్న చర్యల పై క్షుణ్ణంగా చర్చించారు. ప్రధానంగా గ్రామీణ నీటి సరఫరా, రహదా రులు, వ్యవసాయం, విద్య, వైద్య, పంచా యతీరాజ్ అంశాలపై చర్చిం చారు. ఏడు స్థాయీ సంఘాల సమావేశాలు ఆయా సంఘాల చైర్‌పర్స న్‌ల అధ్యక్షతన జరిగాయి.
సంక్షేమ కార్యక్రమాలు పూర్తిస్థాయిలో అమలయ్యేలా కృషి
ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ వేణుగోపాలరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలు పూర్తిస్థాయి లో అమలయ్యే విధంగా చూడటంతోపాటు వ్యవసాయానికి సంబం ఽధించి చివరి ఎకరాకు నీరు అం దేలా అధికారులు కృషి చేయాలన్నారు. ఇందుకు గ్రామీణ నీటి సరఫరా, వ్యవసా యం, ఇరిగేషన్ శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించాలన్నారు. గ్రామాల్లో ఉన్న మంచినీటి ట్యాంకులను శుభ్రం చేయించి నీటితో నిం పాలన్నారు. పంటలు పండించే రైతులకు ఇబ్బంది లేకుండా ఉండేం దుకు కాలువలు శుభ్రం చేయించాలన్నారు.
జడ్పీ కల్యాణ మండపం అద్దె తగ్గింపు
కాకినాడ రామారావుపేట టౌన్ రైల్వేస్టేషన్ సమీపంలో గల జిల్లా పరిషత్ కల్యాణ మండపం అందరికీ అందుబాటులో ఉండే విధంగా అద్దె తగ్గించారు. గతంలో ఉన్న అద్దెను తగ్గిస్తూ రుసుంను సవరిం చారు. ఈ మేరకు సవరించిన రుసుం కరపత్రాన్ని చైర్మన్, సీఈవో, జడ్పీటీసీ సభ్యులతో కలిసి విడుదల చేశారు. ఏజెన్సీ, ఇతర ముంపు మండలాల సమస్యలపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి త్వరితగతిన పరిష్కరించాలని ఏజెన్సీ మండలాల జడ్పీటీసీ సభ్యులు అధికారులను కోరారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సీఈవో ఎన్‌వీవీ సత్యనారాయణ, డీపీవో ఆర్.విక్టర్, డ్వామా పీడీ ఎం.వెం కటలక్ష్మి, డిప్యూటీ సీఈవో ఎ.రమణారెడ్డి, ఏవో ఎం.బుజ్జిబాబు, హౌసి ంగ్, డీఆర్‌డీఏ, ఇరిగేషన్, వ్యవసాయం, గ్రామీణ నీటి సరఫరా, విద్య, వైద్యం, రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్ శాఖలు కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరిజిల్లాల అధికారులు, జడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు.
పశ్చిమ డెల్టా కాలువకు తగ్గిన నీటి విడుదల
విజ్జేశ్వరంవద్ద 4.70 అడుగులకు పడిపోయిన గోదావరి నీటిమట్టం
ధవళేశ్వరం, మార్చి 18: విజ్జేశ్వరంవద్ద గోదావరి నీటిమట్టం ప్రమా దకరస్థాయికి పడిపోవడంతో పశ్చిమ డెల్టాకాలువకు నీరుపారక సాగు నీరు క్రమంగా తగ్గిపోతుంది. విజ్జేశ్వరంవద్ద హెడ్ స్లూయిజ్ అప్రోచ్ చానల్‌లో గోదావరి నీటిమట్టం పెరిగితేనే డెల్టా కాలువకు సాగునీరు ప్రవహిస్తోంది. ప్రస్తుతం నీటిమట్టం 4.70 అడుగులకు పడిపోవడంతో పశ్చిమ డెల్టా కాలువకు 250 క్యూసెక్కులు తగ్గి 3300 క్యూసెక్కులు మాత్రమే ప్రవహిస్తోంది. డిమాండ్ మేరకు 5వేల క్యూసెక్కులు సాగు నీరు ఇవ్వాల్సి ఉండగా ప్రస్తుతం 133డ్యూటీలో 3300 క్యూసెక్కులు మాత్రమే కాలువకు ప్రవహిస్తోంది. ధవళేశ్వరం వద్ద గోదావరి నీటిమ ట్టం 5.05 అడుగులుగా నమోదుకాగా తూర్పుడెల్టాకు 2170 క్యూసె క్కులు, మధ్య డెల్టాకు 1410 క్యూసెక్కులు చొప్పున మొత్తం 3 డెల్టా లకు 6880 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.