‘సూర్య’ ప్రతాపం

ABN , First Publish Date - 2023-06-03T01:17:47+05:30 IST

జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. మే నెలతో అత్యధిక ఉష్ణోగ్రతలు ఆరంభమై జూన్‌లోనూ కొనసాగుతున్నాయి.

‘సూర్య’ ప్రతాపం

రాజమహేంద్రవరం సిటీ, జూన్‌2: జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. మే నెలతో అత్యధిక ఉష్ణోగ్రతలు ఆరంభమై జూన్‌లోనూ కొనసాగుతున్నాయి. నెల రోజులుగా 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలకు వడగాడ్పుల తీవ్రత పెరిగింది. రాజమహేంద్రవరంలో శుక్రవారం గరిష్ఠంగా 44.5 డిగ్రీలు, కనిష్ఠంగా 28.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం 9 గంటల నుంచి వడగాడ్పు లు వీచాయి. తారస్థాయిలో భానుడు ఉగ్రరూపం చూపడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు.జిల్లాలో రాజమహేంద్రవరంలోనే అత్యధికంగా 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అనపర్తి 40.3, బిక్కవోలు 40.2, చాగల్లు 42.7, దేవరపల్లి 44.3, గోకవరం 43.5, గోపాలపురం 43.4, కడియం 40.5, కోరుకొండ 43, కొవ్వూరు 43.6, నల్లజర్ల 43.0, నిడదవోలు 42.0 , పెరవలి 43.1, రాజమహేంద్రవరం రూరల్‌ 44.0 డిగ్రీలు, రాజానగరం 43.6, రంగంపేట 42.2, సీతానగరం 43.1, తాళ్ళపూడి 43.3, ఉండ్రాజవరంలో 43.3 డిగ్రీల ఉష్ణోగత్రలు నమోదయ్యాయి. మరొక రెండు రోజుల పాటు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల శాఖ సూచిస్తుంది.

Updated Date - 2023-06-03T01:17:47+05:30 IST