భార్యను భయపెడదామని...

ABN , First Publish Date - 2023-06-26T01:10:49+05:30 IST

భార్యను భయపెడదామని పెట్రోల్‌ పోసుకుని నిప్పు అంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన భర్త మృతిచెందినట్టు కొవ్వూరు రూరల్‌ ఎస్‌ఐ జి.సతీష్‌ తెలిపారు.

భార్యను భయపెడదామని...

కొవ్వూరు, జూన్‌ 25 : భార్యను భయపెడదామని పెట్రోల్‌ పోసుకుని నిప్పు అంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన భర్త మృతిచెందినట్టు కొవ్వూరు రూరల్‌ ఎస్‌ఐ జి.సతీష్‌ తెలిపారు. కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామానికి చెందిన షేక్‌ బాజీ (40) తాపీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గత నెల 21వ తేదీన భార్యతో ఘర్షణపడ్డాడు. భయపెడదామని ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని లైటర్‌తో నిప్పు అంటించుకున్నాడు. దీంతో తీవ్రగాయాలపాలైన బాజీని అత్యవసర వైద్యం నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. మృతుడి సోదరి షేక్‌ బీబీ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్టు ఎస్‌ఐ సతీష్‌ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Updated Date - 2023-06-26T01:10:49+05:30 IST