యుహెచ్‌సీని ఆకస్మిక తనిఖీ చేసిన డీఎంహెచ్‌వో

ABN , First Publish Date - 2023-03-02T01:50:05+05:30 IST

ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని డీఎం అండ్‌ హెచ్‌వో డాక్టర్‌ కె.వెంకటేశ్వరరావు అన్నారు.

యుహెచ్‌సీని ఆకస్మిక తనిఖీ చేసిన డీఎంహెచ్‌వో

కొవ్వూరు, మార్చి 1: ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని డీఎం అండ్‌ హెచ్‌వో డాక్టర్‌ కె.వెంకటేశ్వరరావు అన్నారు. బుధవారం నిడదవోలు పట్టణంలో సీఎం కార్యక్రమానికి వెళుతూ కొవ్వూరు క్రిస్టియన్‌పేటలోని అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ను ఆకస్మిక తనిఖీ చేశారు. యుహెచ్‌ిసీ రికార్డులను పరిశీలించారు. ఆసుపత్రి ఓపీ పెంచాలని, వైద్యసేవలకోసం ఆసుపత్రికి వచ్చే రోగులకు అందించాల్సిన వైద్యసహాయంపై సిబ్బందికి సూచనలు, సలహాలను అందజేశారు. కార్యక్రమంలో వైద్యులు బి.శ్రీనివాస్‌, తిరువీదుల సుష్మ, స్టాఫ్‌నర్సులు భవానీ, సుజాత, లాబ్‌ టెక్నీషియన్‌ సౌజన్య, ఫార్మాసిస్టు రమ్యకృష్ణ, సిబ్బంది ప్రభాకర్‌, మూర్తి ఉన్నారు.

Updated Date - 2023-03-02T01:50:05+05:30 IST