చదువు ఆగిపోతుందన్న బెంగతో విద్యార్థి ఆత్మహత్య
ABN , First Publish Date - 2023-07-21T00:27:20+05:30 IST
చదువు ఆగిపోతుందన్న బాధతో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్‌ఐ చిరంజీవి అందించిన వివరాల ప్రకారం.. సీతానగరం మండలం కాటవరం గ్రామానికి చెందిన బోమాటి ఉదయశంకర్(15) పదో తరగతి పాసయ్యాడు. ప్రైవేటు కళాశాలలో చదువు కుంటానని చెప్పడంతో తల్లిదండ్రులు ఈ సంవత్సరం ఇల్లు కడుతున్నాం కదా ఇంటి వద్దనే ఉండు వచ్చే సంవత్సరం కళాశాలలో చదివిస్తామని చెప్పారు.
సీతానగరం, జూలై 20: చదువు ఆగిపోతుందన్న బాధతో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్‌ఐ చిరంజీవి అందించిన వివరాల ప్రకారం.. సీతానగరం మండలం కాటవరం గ్రామానికి చెందిన బోమాటి ఉదయశంకర్(15) పదో తరగతి పాసయ్యాడు. ప్రైవేటు కళాశాలలో చదువు కుంటానని చెప్పడంతో తల్లిదండ్రులు ఈ సంవత్సరం ఇల్లు కడుతున్నాం కదా ఇంటి వద్దనే ఉండు వచ్చే సంవత్సరం కళాశాలలో చదివిస్తామని చెప్పారు. దీంతో తన చదువు ఆగిపోతుందని బాధపడ్డాడు. బుఽధవారం తల్లిదండ్రులు ఇంటి పనుల నిమిత్తం డబ్బులు అవసరమై పొరుగూరు వెళ్లిన సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులు తిరిగి ఇంటికి చేరుకుని తలుపులు తీసే సరికి దూలానికి వేలాడుతున్న కుమారుడిని చూసి బోరున విలపించారు. తండ్రి బోమాటి భూషణం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. కాగా ఉదయశంకర్ ఆత్మహత్య విషయం తెలసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లగా బాలుడికి పోస్టుమార్టం చేయడం కుదరదని, కేసు పెట్టడానికి వీలులేదని కుటుంబ సభ్యులు, స్థానికులు అభ్యంతరం తెలపడంతో ఎస్‌ఐ చిరంజీవి కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి కేసు గురువారం నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.