‘గ్రాసిం’ విస్తరణ పనులు నిలిపివేయాలి

ABN , First Publish Date - 2023-02-10T00:54:26+05:30 IST

బిక్కవోలు మండలం బలభద్రపురంలో గ్రాసిం ఇండస్ట్రీ విస్తరణ పనులను నిలుపుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ గురు వారం బలభద్రపురంలో సామర్లకోట-వేమగిరి రోడ్డుపై వంతెన వద్ద టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పాదయాత్ర నిర్వహించి రాస్తారోకో నిర్వహించారు.

‘గ్రాసిం’ విస్తరణ పనులు నిలిపివేయాలి
బలభద్రపురంలో సామర్లకోట-వేమగిరి రోడ్డుపై రాస్తారోకో నిర్వహిస్తున్న రామకృష్ణారెడ్డి

  • లేకుంటే భారీ ఎత్తున ఉద్యమిస్తాం

  • టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామకృష్ణారెడ్డి

  • బలభద్రపురంలో పాదయాత్ర.. రాస్తారోకో

అనపర్తి, ఫిబ్రవరి 9: బిక్కవోలు మండలం బలభద్రపురంలో గ్రాసిం ఇండస్ట్రీ విస్తరణ పనులను నిలుపుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ గురు వారం బలభద్రపురంలో సామర్లకోట-వేమగిరి రోడ్డుపై వంతెన వద్ద టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పాదయాత్ర నిర్వహించి రాస్తారోకో నిర్వహించారు. ముందుగా తాతానగరం ఉన్నత పాఠశాల నుంచి ‘గ్రాసిమ్‌ వద్దు ఆరోగ్యమే ముద్దు’ నినాదంతో గ్రా మంలో ప్రజలను చైతన్య పరుస్తూ పాదయాత్ర నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన వీదుల గుండా వంతెనకు చేరుకుని అక్కడ కెనాల్‌రోడ్డుపై బైఠా యించి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రూ.900 కోట్లతో ప్రారంభించిన ఇండస్ట్రీ వల్ల పరిసర గ్రామాల ప్రజ లు కాలుష్యంతో ఇబ్బందులకు గురువుతున్నా రని, ప్రస్తుతం రూ.2450 కోట్లతో విస్తరణ చేయాలని సంస్థ సిద్ధమవుతోందని, దీనిని నిలుపుదల చేయకుంటే ఇండస్ట్రీకి 40 కిలోమీటర్ల మేర కాలుష్యంతో నిండిపోతుందని, భూగర్బ జలాలు ఇంకిపోయి తాగునీరు కూడా కరువయ్యే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఈ విస్తరణ ద్వారా మరో 84 రకాల కెమికల్స్‌ తయారు చేస్తారని వీటిలో అనేకం ప్రాణాంతకమని అన్నారు. ప్రతిపక్షంలో ఉండగా వైసీపీ ఇటువంటి పరిశ్రమలు ఊర్ల మధ్యలో ఉండకూడదని బంగాళాఖాతంలో కలపాలని నినాదాలు చేసి నేడు గ్రాసిం సంస్థ ఇచ్చే తాయిలాల కోసం ఎమ్మెల్యే ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమర్‌రాజా సంస్థ విస్తరణ పనులను కాలుష్యం పేరుతో వేరే రాష్ట్రానికి తరలికొట్టిందని ఇక్కడ మాత్రం ఎందుకు కాపు కాస్తున్నారని ఆయన ప్రశ్నించారు. గ్రాసిం విస్తరణతో ప్రజలకు కలిగే ఇబ్బం దులపై అవగాహన కల్పిస్తున్నామని తాము చేసే పోరాటంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని ఇప్పుడే అడ్డుకోకుంటే భావితరాల భవిష్యత్‌ అంధకా రంగా మారుతుందని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు తమలంపూడి సుధాకరరెడ్డి, సత్తి దేవదానరెడ్డి, కొవ్వూరి శ్రీనివాసరెడ్డి, వెలుగుబంటి సత్యనారాయణ, నల్లమిల్లి సుబ్బారెడ్డి, త్రిమూర్తులు, కొవ్వూరి వేణుగోపాలరెడ్డి, పడాల ఆదినారా యణరెడ్డి, కర్రి వెంకటరామారెడ్డి, ఒంటిమి సూర్యప్రకాష్‌, రాజు, రంగంపేట, బిక్కవోలు మండలాల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

  • గ్రాసిం సమస్యను చంద్రబాబు దృష్టికి తీసుకొస్తాం

ఈనెల 17న అనపర్తి పర్యటనకు వస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టికి గ్రాసిం సమస్యలను తీసుకువస్తామని రామకృష్ణారెడ్డి అన్నారు. గ్రాసిం ఇండస్ట్రీ వల్ల ప్రజలకు ఎటువంటి హాని జరుగకుండా విస్తరణ పనులకు అడ్డుకుంటామన్నారు. ఆయన ఆదేశాలతో భవిష్యత్‌ కార్యాచరణ రూపొందిం చుకుని పోరాటం చేస్తామన్నారు. 2013లో అప్పటి కేపీఆర్‌ పరిశ్రమ బాధితు లను కలుసుకునేందుకు చంద్రబాబు పాదయాత్రలో భాగంగా బలభద్రపురం వచ్చి వారికి భరోసా కల్పించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

Updated Date - 2023-02-10T00:54:28+05:30 IST