రాష్ట్రస్థాయి ప్రత్యేక అవార్డుకు నాగరాజా స్కూల్‌ హెచ్‌ఎం మంగారాణి ఎంపిక

ABN , First Publish Date - 2023-09-04T00:46:24+05:30 IST

: రాజమహేంద్రవరం నాగరాజా ప్రాఽథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయిని మోటూరి మంగారాణి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక అవార్డుకు ఎంపికయ్యారు.

రాష్ట్రస్థాయి ప్రత్యేక అవార్డుకు నాగరాజా స్కూల్‌ హెచ్‌ఎం మంగారాణి ఎంపిక

రాజమహేంద్రవరం సిటీ, సెప్టెంబరు 3: రాజమహేంద్రవరం నాగరాజా ప్రాఽథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయిని మోటూరి మంగారాణి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక అవార్డుకు ఎంపికయ్యారు. అలాగే జిల్లాస్థాయి సెంటా అవార్డుకు కూడా ఆమె ఎంపికయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యాసంవత్సరం నుంచి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుతో పాటు ప్రత్యేకంగా సెంటర్‌ ఫర్‌ టీచర్‌ అక్రిడిటేషన్‌ అవార్డ్‌ను ఏర్పాటుచేసి అందు నిమిత్తం ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. దాని ప్రకారం ఆదివారం రాష్ట్రప్రభుత్వం విడుదల చేసిన ఫలితాల్లో రాష్ట్రస్ధాయికి 10 మంది, జిల్లా స్థాయిలో 120 మంది ఎంపికయ్యారు. తూర్పుగోదావరి నుంచి జిల్లా అవార్డుకు నలుగురు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఎంపిక కాగా, ప్రాథమిక పాఠశాలస్థాయి నుంచి మంగారాణి ఒక్కరే జిల్లా ఉత్తమ ఉపాధ్యాయినిగా ఎంపికయ్యారు. డీఈవో ఎస్‌.అబ్రహాం, అర్బన్‌ డీఐ బి.దిలిప్‌కుమార్‌, అర్బన్‌ ఎంఈవో-2 రమా రజనీలు అవార్డుకు ఎంపికైన మంగారాణిని అభినందించారు.

Updated Date - 2023-09-04T00:46:24+05:30 IST